మహిళలు అది వేసుకోవడం వల్లే పిల్లలు అలా పుడుతున్నారు.? – పంతులుగారి దారుణ మాటలు!!

హిజ్రాలు.. స‌మాజంలో ఉండే మూడో వ‌ర్గానికి చెందిన వారు. అయినా వారు మ‌నుషులే. వారి హ‌క్కులు కూడా వారికి ఉంటాయి. అస‌లు ఏ వ్య‌క్తి అయినా హిజ్రా అవ‌డానికి అనేక కార‌ణాలుంటాయి. కొంద‌రు పుట్టుక‌తోనే ఆ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటారు. కానీ కొంద‌రు మ‌ధ్య‌లో అలా మారుతారు. అంత మాత్రాన వారిపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌దు. ఈ క్ర‌మంలోనే తాజాగా కేర‌ళ‌కు చెందిన ఓ ప్ర‌భుత్వ కాలేజీ ప్రొఫెస‌ర్ ఇప్పుడు హిజ్రాల‌పై, మ‌హిళల వ‌స్త్ర ధార‌ణ‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

కేరళ రాష్ట్రం కాలడిలోని ఓ గవర్నమెంట్ కాలేజీలో డాక్ట‌ర్ రజిత్‌ కుమార్ అనే అత‌ను ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల విద్యార్థుల కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించ‌గా ర‌జిత్ ఆ కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు. అయితే కార్య‌క్ర‌మంలో భాగంగా రజిత్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు కూడా పురుషుల్లా జీన్స్ ప్యాంట్లు ధరించడం వల్ల ఆ మహిళల‌కు పుట్టే పిల్లలు తేడాగా మారుతున్నారని, వారు ట్రాన్స్‌జెండ‌ర్లు అవుతున్నార‌ని అన్నాడు. పిల్లలు ట్రాన్స్‌జెండర్లుగా మారడానికి, అటిజంతో బాధపడటానికి వారి త‌ల్లులు జీన్స్ ప్యాంట్లు ధ‌రించ‌డ‌మే కార‌ణ‌మ‌ని త‌ల తిక్క లేని వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆ రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి.

కాగా రజిత్ చేసిన ఆ అశాస్త్రీయ, లైంగిక వివక్ష వ్యాఖ్యలపై అన్ని సంఘాలు మండిప‌డుతున్నాయి. బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారంటూ మహిళా సంఘాలు, పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రజ‌త్‌ వ్యాఖ్యలపై రోజురోజుకీ వివాదం పెద్దదిగా మారుతుండటంతో.. ఆయన్ను ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించరాదని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు కేరళ విద్యాశాఖ‌ మంత్రి కేకే శైలజ ఆదేశాలు జారీ చేశారు. మ‌రిప్పుడు ఇక ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల‌పై ఏమంటారో చూడాలిక‌. అయినా మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై కామెంట్లు చేయ‌డం అంద‌రికీ ఫ్యాష‌న్ అయిపోయింది. త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన దుస్తులు వేసుకోవడం అనేది ఎవ‌రికైనా ఉండే హ‌క్క‌ని ఇలాంటి వారు ఎప్పుడు గ్ర‌హిస్తారో..!

Comments

comments

Share this post

scroll to top