ఇది ఓ మహిళ సాహసయాత్ర, మహిళలు వంటగదికే పరిమితం కావొద్దంటూ 26 రోజుల పాదయాత్ర.

ఆమె పేరు ఆంచల్ ధార. రోజుకి 12 గంటలు ,అలా వరుసగా 26 రోజులు ఒంటరిగా ముంబయి నుండి గోవా వరకు మొత్తం  583 కి.మీ నడిచి రికార్డ్ సృష్టించింది. ఆమె ఈ పాదయాత్రను రికార్డ్ లకోసం చేపట్టలేదు. ఓ సంకల్పం కోసం… మహిళలలో చైతన్యం కోసం చేసింది.  ముంబయిలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయిన ఆంచల్ కు మహిళలు ప్రతి ఒక్క రంగంలోనూ పోరాడాలని, తమ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పేలా చేయాలనేది ఆమె కోరిక. ఈ లక్ష్యంతోనే తన భర్తతో కలిసి ‘అడాషియస్’అనే ప్రాజెక్ట్ ను ఆంచల్ మొదలుపెట్టింది. మహిళలు స్వేచ్చాజీవితం గడపాలని, ఇంటిపని, వంటగదికే పరిమితం కాకుండా సమాజంలో స్త్రీ శక్తి ఎంత గొప్పదో, తమ ప్రతిభను నిరూపించుకోవాలన్నదే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

Aan-1-700x467

కాగా ‘అడాషియాస్’ ప్రాజెక్ట్ లోని మొదటిదశకు ‘టూ ఫీట్ అండ్ ఏ డ్రీమ్’ పేరు పెట్టి, కాలినడక ద్వారా మహిళలను  ఉత్తేజపరచే ప్రయత్నం చేసింది ఆంచల్. అలా ముంబైలోని అంధేరీ నుండి ఒంటరిగా తనకాలినడక ప్రయాణాన్ని మొదలుపెట్టి 26 రోజుల్లో గోవాలోని మొర్జిమ్ కు చేరింది. అలా 26 రోజుల్లో 583 కి.మీ పాటు నడుస్తూ మహిళలను చైతన్యపరుస్తూ సాగింది ఆమె పాదయాత్ర.. ఈ ప్రయాణంలో తనకు చాలామంది కొత్తవారు, కల్మషం లేని వ్యక్తులు కనిపించారని చెబుతోంది ఆంచల్.

Day-7-700x439

ఓ సర్వే ప్రకారం ఇప్పటికీ భారతదేశంలో 67 శాతం మహిళలు వంటింట్లకే పరిమితమవుతున్నారని, అన్ని రకాల నైపుణ్యాలున్నా కామ్ గా ఉన్న వారు 20 శాతానికి పైగానే ఉంటారని అంచనా. ఉద్యోగమో , వ్యాపారమో చేసే కెపాసిటీ ఉన్నా అనేక కారణాల్ల వల్ల ఇంట్లోనే ఉంటున్నారని అంచనా.!

Comments

comments

Share this post

scroll to top