1000 శానిట‌రీ పాడ్స్ ని ఆ మహిళలు “మోడీ” కి పంపనున్నారు..దానిపై ఏం రాసారో తెలుసా.? ఎందుకంటే.?

జీఎస్‌టీ.. గ‌తేడాది జూలై 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమ‌లులోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అనేక ర‌కాల వ‌స్తువులు, సేవ‌ల‌ను ప‌లు శ్లాబుల్లో చేర్చి వాటికి జీఎస్టీ విధిస్తూ వ‌స్తున్నారు. కాగా ఇటీవ‌లి కాలంలో ప‌లు జీఎస్‌టీ వ‌స్తువుల శ్లాబుల‌ను మార్చ‌గా కొన్నింటిని మాత్రం జీఎస్‌టీ నుంచి తీసేశారు. అయితే మ‌హిళ‌లు ధ‌రించే శానిట‌రీ నాప్‌కిన్స్ ను మాత్రం ఇంకా జీఎస్‌టీ నుంచి తీసేయ‌లేదు. గ‌తంలో వాటికి 18 శాతం జీఎస్‌టీ విధించ‌గా ఇప్పుడ‌ది 12 శాతం అమ‌ల‌వుతోంది. అయిన‌ప్ప‌టికీ శానిట‌రీ నాప్‌కిన్స్ కు పూర్తిగా జీఎస్‌టీ మిన‌హాయించాల‌ని మ‌హిళ‌లు, సామాజిక కార్య‌క‌ర్త‌లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళ‌న చేస్తున్నారు.

మ‌హిళ‌లు వాడే శానిట‌రీ నాప్‌కిన్స్ కు జీఎస్టీ నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని ఇప్పుడు అనేక మంది గ‌ళం విప్పుతున్నారు. ఇందుకుగాను కొంద‌రి ఆధ్వ‌ర్యంలో ఓ ప్ర‌త్యేక క్యాంపెయిన్ న‌డుస్తోంది. వారు 1000 శానిట‌రీ నాప్‌కిన్స్ సేక‌రించి వాటిపై ప‌లు సందేశాలు రాసి అనంత‌రం ఆ నాప్‌కిన్స్‌ను దేశ ప్ర‌ధాని మోడీకి పంప‌నున్నారు. నేటి త‌రుణంలో చాలా మంది మ‌హిళ‌ల‌కు ఇంకా శానిట‌రీ నాప్‌కిన్స్‌ను ఎలా వాడాలో తెలియ‌ద‌ని, వీటిని ల‌గ్జరీ వ‌స్తువుల ఎలా జ‌మ వేస్తార‌ని, వీటిని అధిక ధ‌ర వెచ్చించి పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌లు ఎలా కొనుగోలు చేస్తార‌ని నాప్‌కిన్స్‌పై సందేశాల‌ను రాయ‌నున్నారు.

అలాగే శానిట‌రీ నాప్‌కిన్స్‌పై ఉన్న జీఎస్టీని ఎత్తి వేయాల‌ని, వాటిని ప్ర‌భుత్వ‌మే పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌ల‌కు ఉచితంగా స‌బ్సిడీ కింద అంద‌జేయాల‌నే డిమాండ్ల‌ను శానిట‌రీ నాప్‌కిన్స్‌పై రాయ‌నున్నారు. ఇలా రాసిన 1000 శానిటరీ నాప్‌కిన్స్ ను మ‌హిళ‌లు ప్ర‌ధాని మోడీకి పంప‌నున్నారు. ఇలా చేస్తే అయినా క‌నీసం ఈ స‌మ‌స్య‌పై ప‌ట్టించుకుంటార‌ని, దాంతో త‌క్కువ ధ‌ర‌కే మ‌హిళ‌ల‌కు శానిట‌రీ నాప్‌కిన్స్ సాధించ‌వ‌చ్చ‌ని ప‌లువురు తెలియ‌జేస్తున్నారు. ఇక కొంద‌రు మ‌రింత ముందుకు వెళ్లి శానిట‌రీ నాప్‌కిన్స్‌పై జీఎస్‌టీ ఎత్తేయాల‌ని త్వ‌ర‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేయ‌నున్నారు. అయినా.. నిజంగా విడ్డూరం కాక‌పోతే.. మ‌రీ ఈ వ‌స్తువుల‌పై కూడా జీఎస్‌టీ ఏంటీ..? వాటిని అస‌లు ప్ర‌భుత్వ‌మే ఫ్రీగా ఇవ్వాలి క‌దా..!

Comments

comments

Share this post

scroll to top