నీచాతి నీచులు.. క్రూరులు.. వారు మనుషులు కాదు, రాక్షసులు.. అవును, ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే నిజంగా మీరు కూడా అదే అంటారు. ఇంకా చెప్పాలంటే ఆ క్రూరులను వర్ణించేందుకు ముందు చెప్పిన మాటలు కూడా సరిపోవేమో. అంతలా వారు ఆమెను హింసించారు. అత్యాచారం చేశారు. ఈ క్రమంలో ఆ బాధితురాలు ఇప్పుడు చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన జరిగింది పశ్చిమ బెంగాల్లో.
పశ్చిమ బెంగాల్‌లోని కూస్మండి సౌత్ దినాజ్పూర్లో ఫిబ్రవరి 18వ తేదీన బుద్ధి మాంద్యం ఉన్న ఓ 21 ఏళ్ల గిరిజన మహిళ ఆదివారం కావడంతో ఆ రోజు సంతకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తోంది. మార్గమధ్యలో ఓ వంతెన వద్ద ఆమెను అటకాయించిన కొందరు మృగాళ్లు ఆమెను వంతెన కిందకు లాక్కెళ్లారు. అనంతరం ఆమెను హింసిస్తూ ఆమెపై అత్యాచారం చేశారు. బలమైన ఇనుప రాడ్లను ఆమె మర్మావయవాల్లోకి చొప్పించారు. ఈ క్రమంలో ఆ మహిళ బాధకు తాళలేక కేకలు వేసింది.
బాధిత మహిళ కేకలు వేయడంతో చుట్టు పక్కల ఉన్న స్థానికులు పరుగు పరుగున ఆమె వద్దకు వచ్చి ఆమెను రాయ్‌గంజ్ లో ఉన్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మాల్దా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ హాస్పిటల్లో ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. ఆమెను ఐసీయూలో ఉంచారు. శరీరం లోపల గాయాలు కావడంతో వాటికి సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆమె ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం బాధితురాలు స్పృహలో లేదు.
అయితే ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు పాల్పడిన వారిలో ఒక వ్యక్తిని వారు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇక ఇప్పుడు మీరే చెప్పండి, ఇలాంటి పని చేసిన ఆ నీచులను ఏం చేయాలో. నిజంగా ఇలాంటి వారికి భూమిపై బతికే హక్కు ఉందంటారా ?