మహిళ హత్యకేసును ఛేదించిన “బ్రెడ్ ఆమ్లెట్”..! ఎలాగో తెలుస్తే..? వాట్సాప్ లో బ్రెడ్ ఆమ్లెట్ ఫోటో వల్ల..!

బీహార్‌లోని భగల్‌పూర్‌కు చెందిన నేహా హత్య కేసులో పోలీసులు ఆమె భర్త దినేష్ కుమార్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. తీర్పు అనంతరం అక్కడి నుంచి జైలుకు తరలించారు. ఈ కేసులో పోలీసులకు వాట్సప్ మెసేజ్, బ్రెడ్ ఆమ్లెట్ ఫొటోలు సాక్ష్యంగా నిలిచాయి. వివరాల్లోకి వెళితే నేహా తన సోదరునికి వాట్సప్ మెసేజ్ పంపించింది. దీనిలో కీలక విషయాలు వెల్లడించడంతో పాటు దీనిని డిలీట్ చేయవద్దని కోరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సేహ తన సోదరి, సోదరులకు తన భర్త చేసిన పని గురించి వాట్సప్ మెసేజ్ పంపించింది. దానిలో దినేష్ తనకు బ్రెడ్ ఆమ్లెట్‌లో ఏదో మందు కలిపి ఇచ్చిన విషయాన్ని తెలియజేసింది.

దానితోపాటు బ్రెడ్ ఆమ్లెట్ ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ ఆధారాలతో పోలీసులు విచారణ చేపట్టారు. తనకు పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఈ బ్రెడ్ తినిపిస్తున్నారని ఆమె వాట్సప్ మెసేజ్‌లో పేర్కొంది. అందుకే ఈ ఫొటోను డిలీట్ చేయవద్దని కోరింది. అయితే ఈ బ్రెడ్ ఆమ్లెట్ తిన్న తరువాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఫొటోనే దర్యాప్తులో కీలకంగా మారి హంతకునికి శిక్ష పడేలా చేసింది.

Comments

comments

Share this post

scroll to top