హోట‌ల్‌లో ప‌నిచేస్తున్న మ‌హిళ చీర లాగాడు సెక్యూరిటీ మెనేజ‌ర్‌. ఆ మ‌హిళ‌నే ఉద్యోగం నుంచి తీసేశారు. సిగ్గుమాలిన చ‌ర్య‌..!

ఛీ.. ఛీ.. సిగ్గు సిగ్గు.. నిజంగా సిగ్గు ప‌డాలి.. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం ఎన్నో చట్టాల‌ను తెచ్చామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ వారిపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. దాడులు కొనసాగూతూనే ఉన్నాయి. అనేక మంది మహిళ‌లు నిత్యం ఏదో ఒక చోట వేధింపుల‌కు గుర‌వుతూనే ఉన్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో తాజాగా ఓ మృగాడి కీచ‌క‌ప‌ర్వం వెలుగులోకి వ‌చ్చింది. ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో సెక్యూరిటీ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తున్న‌ మ‌హిళా ఉద్యోగిపై వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే చ‌ర్య‌లు తీసుకోవాల్సింది పోయి ఆమెనే ఉద్యోగం నుంచి తొల‌గించింది ఆ హోట‌ల్ యాజ‌మాన్యం.

ఢిల్లీలోని ఎయిరోసిటీ హోట‌ల్ అది. అక్క‌డ ఓ మ‌హిళా ఉద్యోగి (33) సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తోంది. ఆమె గ‌త నెల 29వ తేదీన త‌న జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకుంది. అయితే అదే సంద‌ర్భంగా భావించిన ఆ హోట‌ల్ సెక్యూరిటీ మేనేజ‌ర్‌ ప‌వ‌న్ ద‌హియా స‌ద‌రు మ‌హిళ‌ను త‌న గ‌దికి పిలిచాడు. క్రెడిట్ కార్డు ఇస్తాన‌ని చెప్పాడు. కావ‌ల్సింది కొనుక్కోమ‌ని చెప్పాడు. దాన్ని ఆమె తిర‌స్క‌రించి వెళ్లిపోబోయింది. దీంతో ప‌వ‌న్ ఆమె చీర లాగాడు. అత‌న్నుంచి ఆ మ‌హిళ త‌ప్పించుకుంది. ప‌వ‌న్‌ను ప్ర‌తిఘ‌టిస్తూ తప్పించుకుని ఆ మ‌హిళ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.

అయితే ఈ దృశ్యాలు అన్నీ అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈ క్ర‌మంలో స‌ద‌రు మ‌హిళ హోట‌ల్ యాజ‌మాన్యానికి ఫిర్యాదు కూడా చేసింది. అనంత‌రం పోలీసుల‌కు చెప్పింది. అయితే దీనిపై హోట‌ల్ చ‌ర్య‌లు తీసుకోక‌పోగా ఆ మ‌హిళ‌నే విధుల నుంచి తొలగించింది. దీంతో ఆమె ఏం చేయాలో తెలియ‌ని స్థితిలో ప్ర‌స్తుతం ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న చాలా ఆల‌స్యంగా వెలుగులోకి రాగా ప్ర‌స్తుతం ఈ వార్త వైర‌ల్ అయింది. ఇక ఆ మ‌హిళ‌పై వేధింపుల‌కు పాల్ప‌డ్డ ఆ వ్య‌క్తిని ఏం చేస్తే బాగుటుందో మీరే చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top