“3 నెలల నుండి ఆ రాజకీయనాయకుడు కొడుకు నన్ను వేధిస్తున్నాడు” అని చేతిమీద రాసి ఆ చిన్నారి తల్లి సూసైడ్!

నేటి తరుణంలో మన దేశంలో మహిళలకు ఎంత భద్రత ఉందో అందరికీ తెలిసిందే. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయ పడాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా మృగాళ్ల బారి నుంచి వారికి వేధింపులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే అలాంటి వారి బారి నుంచి ఎవరో ఒకరిద్దరు మహిళలు ధైర్యంగా పోరాడి తప్పించుకుంటున్నారు. కానీ అలా చేయడానికి సాహసించని మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సదరు మృగాళ్లతో పోరాడే శక్తి లేక అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నారు. మధ్య ప్రదేశ్‌లో కూడా సరిగ్గా ఇలాగే ఓ మహిళ వేధింపులను ఎదుర్కొంటూ ఓ యువకుడి బారి నుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని అశోక్‌ నగర్‌ జిల్లాకు చెందిన ఫూల్‌బాయ్‌ కుష్‌వాహా అనే 30 సంవత్సరాల మహిళను అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడి కుమారుడు బాబీ గత 3 నెలల నుంచి వేధిస్తున్నాడు. దీంతో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ వైపు భర్త ఉన్నప్పటికీ అతనికి తన వేదన చెప్పుకోవడం ఆమెకు ఇబ్బంది అనిపించింది. దీంతో ఆమె పోయిన నెల 19వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఇంట్లో కిచెన్‌లోకి వెళ్లి ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అలా ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ప్పుడు త‌న కూతురు చూసి త‌న తండ్రికి చెప్ప‌డంతో అత‌ను వ‌చ్చి చూసే స‌రికి అప్ప‌టికే కుష్ వాహా చ‌నిపోయింది.

అలా ఆత్మహత్య చేసుకున్న కుష్‌ వాహా తన చేతిపై ఓ సూసైడ్‌ నోట్‌ రాసింది. అందులో ఏమని ఉందంటే.. బాబీ అనే యువకుడు తనను 3 నెలల నుంచి వేధిస్తున్నాడని, ఆ వేధింపులను తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఉంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కుష్‌ వాహా మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే మరో వైపు సదరు బాబీ అనే యువకుడి తండ్రి ధర్మేంద్ర చౌదరి మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేశాడు. తన ఇమేజ్‌ను దెబ్బ తీయడానికే ఎవరో ఈ డ్రామా ఆడి ఉంటారని అతను అంటున్నాడు. ఏది ఏమైనా ఇలాంటి మృగాళ్లను మాత్రం అస్సలు వదలకూడదు. కఠినంగా శిక్షించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top