రంగం లోకి మహేష్ శ్రీమంతుడు, లేటైతే బాహుబలికి బ్యాండే నా???

ప్రిన్స్ మహేశ్ బాబు, శ్రుతిహాసన్ తొలిసారి జంటగా నటిస్తున్న ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.  వన్( నేనొక్కడినే),ఆగడు లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడడంతో మహేష్ కొంచెం గ్యాప్ తర్వాత  శ్రీమంతుడు ప్రాజెక్ట్ కు ఓకే చేశాడు. ఈ సినిమా కు మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీమంతుడు పస్ట్ లుక్ ను చాలా సింపుల్ గా ప్లాన్ చేసినట్టున్నారు. సైకిల్ మీద ప్రిన్స్ చాలా మ్యాన్లీ గా కనిపించాడు.ఫస్ట్ లుక్ బట్టీ సినిమా ను అంచనా వేయడం అసాధ్యమైనప్పటికీ ఈ లుక్ లోని ఇమేజ్ ను బట్టీ ఈ సినిమాలో మహేష్ చాలా ప్లెజెంట్ రోల్ చేయనున్నాడని ఫిల్మ్ వర్గాలు అనుకుంటున్నాయి. గతంలో వన్ నేనొక్కడినే లో మాదిరిగానే మహేష్ ను న్యాచురల్ గా చూపించే ప్రయత్నం చేశారు ఈ ఫస్ట్ లుక్ లో….

sreemantudu
సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 31వ తేదీనే ఫస్ట్ లుక్తో పాటు టీజర్ను కూడా విడుదల చేయాలనుకున్నారు. ఈలోపే ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.  అయితే మహేష్ అభిమానులు మాత్రం మహేష్ శ్రీమంతుడిని, ప్రభాస్ బాహుబలికి  పోటీగా చూస్తున్నారు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోన్న రాజమౌళి బాహుబలి మరో రెండు నెలల్లోథియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది . అది కాస్తా వాయిదా పడితే నాలుగు నెలలు అవుతుంది… ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పనులు జరుగుతున్న శ్రీమంతుడు ఆ గ్యాప్ లో గనుక రంగ ప్రవేశం చేస్తే ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కు అటు మహేష్ ఫ్యాన్స్ పండగే పండగ… పనిలో పనిగా ఎవరిది పై చేయి అనే లెక్కలు ఉండనే ఉంటాయి.

bahubali-movie-free-download
ఫస్ట్ లుక్ తో అదరగొట్టిన మహేష్ బాబుకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ కూడా కాస్త ఎక్కువగానే గ్యాప్ తీసుకున్నారు.  మిర్చి తో ప్రభాస్ లోని కొత్త నటనా కోణాన్ని బయటపెట్టిన కొరటాల మేరేం చేస్తాడో చూడాలి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top