మహేశ్ ‌బాబు నటించిన ‘మహర్షి’ టీజర్ రిలీజ్ అయ్యింది

ఘట్టమనేని మహేశ్ ‌బాబు నటించిన ‘మహర్షి’ టీజర్ ఈ రోజు రిలీజ్ చేసారు , మహేష్ బాబు ఉగాది నాడు తన అభిమానులకు మరియు తెలుగు సినిమా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ మూవీ టీజర్‌ను ఉగాది కానుకగా ఏప్రిల్ 6న ఉదయం 9:09 గంటలకు విడుదల చేసారు . ఈ టీజర్ రిలీజ్ పోస్టర్‌ను నిన్న మహర్షి
చిత్రయూనిట్ విడుదల చేసింది.

వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి సినిమాలో మహేశ్‌ రిషి పాత్రలో నటిస్తున్నారు. టీజర్‌లో రిషికి సంబంధించిన అంశాలను మాత్రమే చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ‘అల్లరి’ నరేశ్‌, కథానాయిక పూజా హెగ్డే పాత్రలకు సంబంధించిన టీజర్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాకు సంగీతం అందించారు. మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా. మహేష్ కెరియర్‌లో ‘మహర్షి’ 25 మూవీ కావడంతో అభిమానులు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. సుమారు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘మహర్షి’. జాయిన్‌ ది జర్నీ ఆఫ్ రుషి అంటూ మహేష్ అటువైపుగా తిరిగి ఉన్న ఇంట్రిస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కి రచయతలుగా వంశీ పైడిపల్లి , హరి , సోలమన్ పని చేశారు , ప్రొడక్షన్ డిజైనేర్ గా సునీల్ బాబు , పాటల రచయత గా శ్రీమణి , ఈ సినిమాకి ఎడిటర్ కే,ఎల్ ప్రవీణ్. ఫైట్ మాస్టర్ గా రామ్ -లక్ష్మణ్ , ఛాయాగ్రహుకుడిగా కే .యూ. మోహనన్ పని చేశారు . ఈ చిత్రంలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

Comments

comments

Share this post

scroll to top