బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక “మహేష్ కత్తి”కి “ఎయిర్ పోర్ట్” లో ఎలాంటి ఊహించని ఎదురైందో తెలుసా..?

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకి మంచి ప్రజాధారణ లభించింది.ఈ షో నుంచి శనివారం మహేష్ కత్తి ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. లోనోవాలాలోని బిగ్‌బాస్ హౌస్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. అయితే హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మహేష్ కత్తికి ఊహించని అనుభవం ఎదురైంది. బిగ్‌బాస్ షోలో 27 రోజలు పాటు మహేష్ కత్తిని చూసిన వారు ఎయిర్‌పోర్టులో గుర్తుపట్టి సెల్ఫీలు అడిగారు. ఈ ఘటనతో మహేష్ కత్తి ఒక్కసారిగా షాక్ అయ్యారంట. ఇంతకు ముందు ఎప్పుడూ తనను ఎవ్వరు ఇలా అడగలేదని చెప్పారు. బిగ్ బాస్ వల్లే తను సెలబ్రిటీగా తిరిగొచ్చానని చెప్తున్నారు.


బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన 14మంది సభ్యుల్లో మొదటి వారంలోనే ఎలిమినేషన్ కోసం మహేష్ కత్తి నామినేట్ అయినప్పటికీ.. ప్రేక్షకులు అండగా నిలవడంతో ఐదు వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో సురక్షితంగా కొనసాగారు. అయితే గత వారంలో జరిగిన ముళ్ల కుర్చీ టాస్క్‌లో మహేష్ కత్తిని పర్యవేక్షకుడిగా బిగ్‌బాస్ నియమించారు. అయితే టాస్క్ నియమాలను మహేష్ ఉల్లంఘించడంతో ఆయన హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. గతంలో సమీర్ కూడా తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను సక్రమంగా నిర్వహించడంలో విఫలం కావడం వల్లే ఎలిమినేట్ అయ్యారు. అదే విధంగా మహేష్ కత్తి కూడా టాస్క్‌పై సరైన పర్యవేక్షణ చూపించకపోవడం వల్లే ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక.. వ్యాఖ్యాత ఎన్టీఆర్‌తో మాట్లాడుతూ తాను కూడా ఆ విషయంపై రియలైజ్ అయ్యానని మహేష్ చెప్పారు.


బిగ్‌బాస్ హౌస్ విశేషాల గురించి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించగా.. హౌస్‌లో తాను చాలా నేర్చుకున్నానని, చాలా అనుభవంతో, ఆలోచనలతో బయటకు వచ్చానని చెప్పారు. బిగ్ బాస్ షోకి సంబందించిన ఒక బుక్ రాస్తానని తెలిపారు. ఆ పుస్తకంలో తన గురించి కూడా ఒకపేజీ ఉండేలా చూడాలని ఎన్టీఆర్ సరదాగా రిక్వెస్ట్ చేశారు. ఈ షో గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మహేష్ కత్తి ఏం మాట్లాడారో కింద వీడియోలో చూడండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top