“భరత్ అనే నేను” సినిమా చూసొచ్చి “మహేష్ కత్తి” ఫేస్బుక్ లో ఏమని పోస్ట్ చేసారో తెలుసా.?

సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన భరత్ అనే నేను సినిమా నేడు రిలీజ్ అయింది. బెనిఫిట్ షోతోనే మంచి హిట్ టాక్‌ను ఈ సినిమా సంపాదించుకుంది. మహేష్, కొరటాల శివ కాంబో అంటేనే చాలా క్రేజ్. అందునా ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో మహేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై కత్తి మహేష్ రివ్యూ ఇచ్చారు.

‘‘భరత్ అనే నేను సినిమా సింపుల్ స్టోరీ కానీ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మహేష్ తన క్యారెక్టర్‌లో లీనమైపోయి నటించారు. కొరటాల శివ నిజమైన ప్రజాస్వామ్యంలో ఏదైతే కచ్ఛితంగా సాధ్యమవుతుందో దానిని కళ్లకు కట్టినట్టు చూపించారు. భరత్ అనే నేను ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా. ప్రతి ఒక్కరూ వెళ్లి చూడండి’’ అంటూ కత్తి మహేష్ తన రివ్యూలో పేర్కొన్నారు.

Comments

comments

Share this post

scroll to top