మొన్న పవన్..ఇప్పుడు బాలయ్య.! “జై సింహ”కి “మహేష్ కత్తి” ఏమని రివ్యూ ఇచ్చారో తెలుసా.?

కత్తి మహేష్ – పవన్ కళ్యాణ్ వివాదం గురించి కొత్త ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంట. గత కొన్ని రోజులుగా టీవీలో ఇదే న్యూస్ చూసి చూసి మన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఇటీవలే మహేష్ కత్తి బాలకృష్ణపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు. `మ‌నుషుల‌ను, అభిమానుల‌ను కొట్ట‌డం అనైతికం. ఆయ‌నకి మెడిక‌ల్ కౌన్సిలింగ్ అవ‌స‌రం. వీలైనంత త్వ‌ర‌గా బాల‌య్య‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాలి. త‌ను ఓ రాజు అయిన‌ట్టు, త‌న వంశం మాత్ర‌మే గొప్ప‌దైన‌ట్టు బాల‌య్య‌ ఫీల‌వుతున్నాడు` అని కత్తి మహేష్ సూటిగా విమర్శలు చేశారు. ఇది ఇలా ఉండగా మహేష్ కత్తి “అజ్ఞ్యాతవాసి” సినిమాకి రివ్యూ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే..! ఇప్పుడు బాలకృష్ణ “జై సింహ” కి ఏమని రివ్యూ ఇచ్చారో తెలుసా.?

80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగురగంప సినిమా “జై సింహ”. నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!

Comments

comments

Share this post

scroll to top