సాయి ధరమ్ తేజ్ “ఇంటెలిజెంట్” పై “మహేష్ కత్తి” సంచలన కామెంట్..! “హీరోయిన్ పృష్ఠ భాగం మీద చేత్తో.. అవసరమా?”

ఇంటిలిజెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సాయిధరమ్ తేజ్..తన మొదటి సినిమా నుండి కూడా మేనమామ మేనరిజమ్స్ ని ఫాలో అవుతూ తనకంటూ సొంత గుర్తింపులేకుండా యాక్ట్ చేస్తూ పోతున్నాడు సాయి..ఇప్పుడు అదే తనకు తిప్పలు తెచ్చిపెట్టేలా ఉంది.అందరు హీరోలతో పోలిస్తే ఏడాదికి పక్కా రెండుమూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే సాయిధరమ్ తేజ్ మొదట్లో ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా..అతని నటన,డ్యాన్స్ లు,ఆఖరుకి సినిమాల్లో  పాటలు కూడా మేనమామ మెగాస్టార్ చిరంజీవినే అనుకరించడం రాను రాను పెద్దగా ఆకట్టుకోవట్లేదు..తాజాగా ఇదే విషయంపై కత్తి మహేశ్ విమర్శలు చేసారు…

హీరోయిన్ల నడుములు గిల్లడం, వాళ్ల ‘బ్యాక్’పై ఓ దెబ్బ కొట్టి అలా ఓ రొమాంటిక్ లుక్కేయడం ఒకప్పటి హీరోలు బాగా ఫాలో అయ్యేవారు. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటున్నాడో.. లేక మేనమామ పాటల్ని రీమేక్ చేసినట్లుగానే ఆయన మేనరిజమ్స్ కూడా  ఇప్పుడు ఫాలో అవుతున్నాడు హీరో సాయిధరమ్ తేజ్. ఆ ట్రెండ్‌పై ఫిలిం క్రిటిక్ కత్తిమహేశ్  సంధించిన విమర్శ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. .

‘అలా… హీరోయిన్ పృష్ఠ భాగం మీద చేత్తో చరిచి, చిలిపిగా తెరవైపు చూసి, ప్రేక్షకులకి కన్నుకొట్టడం చిరంజీవి గారి అరుదైన 90s స్టైల్. ఇమిటేషన్ వరకు ఒకే, కానీ ఇప్పటికీ ఇలా చెయ్యడం అవసరమా!’ అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు కత్తి.

అప్పట్లో చిరంజీవి చాలా సినిమాల్లో ఈ స్టైల్ ను ఫాలో అయిన సంగతి తెలిసిందే. ఇమిటేషన్ ఓకె గానీ ఇప్పుడెందుకు ఇది? అనేది కత్తి అభిప్రాయం.సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ , మేనరిజమ్స్ వరకు ఆయన్నే ఫాలో అవుతున్నట్లుగా అర్థమవుతోంది. ఈ విధంగా  ఇమిటేట్ చేయడం ద్వారా తన కంటూ సొంత మార్క్ అనేది లేకుండా పోతుందనేది మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చాలామంది హీరోలు వైవిధ్యమైన కథలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంటే.. సాయిధరమ్ మాత్రం అనవసరంగా మాస్ ఇమేజ్ కోసం పాకులాడి రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నాడనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

Comments

comments

Share this post

scroll to top