మహేష్ బాబు..బ్రహ్మోత్సవం సినిమా లీక్డ్ డైలాగ్స్ ఇవేనంటూ ప్రచారం.!

ప్రస్తుతం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ లీక్ ల బెడద ఎక్కువైంది. చిన్న,పెద్ద అనేవేవి లేకుండా అన్ని సినిమాలు లీక్ ల భయంతో బెంబేలెత్తిపోతున్నారు. తమ సినిమా షూటింగ్ విజువల్స్, డైలాగ్స్ ఎంత పకడ్బందీగా ఉంచుకున్నా చివరికి ఎలాగోలా అవి బయటకు వచ్చేస్తున్నాయ్. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోని డైలాగ్స్ ఇవేనంటూ కొన్ని డైలాగ్స్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా లీక్డ్  డైలాగులు ఇవే. అయితే వీటిపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు.

నెట్ లో హల్ చల్ చేస్తున్న ‘బ్రహ్మోత్సవం’ లీక్డ్ డైలాగ్స్ :
1. ఫ్యామిలీ ప్రాణం లాంటిది. జాగ్రత్తగా చూసుకోవాలే కానీ, ఎక్కడపడితే అక్కడ మధ్యలో వదిలేయకూడదు.
2. మంచితనం నీ  పుట్టుమచ్చ అయితే… దొంగతనం, చెడ్డతనం నువ్వు పెట్టుకున్న మచ్చలు. ఏ మచ్చలు కావాలో నువ్వే  డిసైడ్ చేసుకో.
3. సమస్యలు అలల్లాంటివి వస్తూ పోతూ ఉంటాయి. నువ్వు తీరంలా ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలి.
4. నలుగురిలో ఉండటం అంటే, నీ ఇంట్లో నలుగు గోడల మధ్య ఉండటం కాదు. నలుగురూ నిన్ను గుర్తించడం.
5.  సముద్రంలో నీరు, అసమర్థుడి దగ్గ డబ్బు ఎంతున్నా ప్రయోజనం ఉండదు.
 
Watch Video:

>

Comments

comments

Share this post

scroll to top