అచ్చం మహేష్ బాబు లాగానే.. ఆశ్చర్యం లో మహేష్, మైనపు బొమ్మ ని ఆవిష్కరించిన సూపర్ స్టార్ మహేష్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు బొమ్మ ని హైదరాబాద్ లోని ఏ.ఎం.బి సినిమాస్ లో ఆవిష్కరించారు. మడామె టుస్సాడ్స్ సింగపూర్ లో మహేష్ బాబు మైనపు బొమ్మ ని బాలీవుడ్ ఇతర స్టార్ యాక్టర్స్ పక్కన పెట్టనున్నారు. మడామె టుస్సాడ్స్ సింగపూర్ లో మైనపు బొమ్మ కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ యాక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డు సృష్టించాడు.

అచ్చం ఆయనే.. :

మహేష్ బాబు నివ్వెరపోయారు ఆయన మైనపు బొమ్మ ని చూసాక, సింగపూర్ లో ఆవిష్కరించవలసిన ఈ మైనపు బొమ్మ ని, అభిమానుల కోరిక మేరకు మహేష్ బాబు మైనపు బొమ్మ ని హైదరాబాద్ లో ఆవిష్కరించారు మడామె టుస్సాడ్స్ సింగపూర్ వాళ్ళు, ఇప్పటి వరకు మడామె టుస్సాడ్స్ వాళ్ళు ఇలా ఇతర చోట ఆవిష్కరించలేదు, మొట్ట మొదటి సారిగా మహేష్ బాబు మైనపు బొమ్మ ని ఇలా ఇతర చోట అది కూడా హైదరాబాద్ లో ఆవిష్కరించడం అనేది చాలా గర్వకారణం.

కేవలం తెలుగు సినిమాలతోనే.. :

కేవలం తెలుగు సినిమాలతోనే ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సాధించారు మహేష్ బాబు. ఇక ఓవర్సీస్ లో మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి మాటల్లో వర్ణించలేము. ఇంతటి ఆదరణ అభిమానం కలిగిన స్టార్ హీరో, టాలీవుడ్ స్థాయి ని పెంచడం లో ఎప్పుడు ముందుంటాడు. అందుకే అతనికి ఈ గౌరవం దక్కిందని అభిమానులు మొదలు సినిమా పెద్దల వరకు అభిప్రాయపడుతున్నారు.

ప్రభాస్ మహేష్ మాత్రమే.. :

రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే మడామె టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం కలిగిన టాలీవుడ్ స్టార్స్, వీరిరువురు టాలీవుడ్ స్థాయి ని పెంచడమే కాకుండా, తెలుగు వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తీసుకొచ్చారు.

ఆశ్చర్యంలో చిన్నారి.. :

మహేష్ బాబు కుటుంబంతో సహా తన మైనపు విగ్రహ ఆవిష్కరణకు అటెండ్ అయ్యారు. మహేష్ మైనపు బొమ్మ ని చుసిన సితార పాప ఆశ్చర్యపోయింది. నమ్రత, గౌతమ్ కూడా ఆశ్చర్యపోయారు. మైనపు బొమ్మ ని ఆవిష్కరించిన తరువాత మీడియా తో మహేష్ బాబు ముచ్చటించారు. తనదైన శైలి లో మీడియా కి కొన్ని గట్టి కౌంటర్లు వేసారు మహేష్ బాబు.

 

Comments

comments

Share this post

scroll to top