మహేష్ బాబు టీమ్… ఐపియల్ లోకి ఎంటర్ కాబోతోంది?

ధనాదన్ క్రికెట్ IPL( ఇండియన్ ప్రీమియర్ లీగ్ ) లోకి ఫ్రిన్స్ మహేష్ బాబు టీమ్ ఎంటర్ కానుందనే పుకార్లు ఫిల్మ్ నగర్ చుట్టూ  చక్కర్లు కొడుతున్నాయ్. ప్రపంచంలోనే ఐపియల్ మోస్ట్  కాస్లియస్ట్ క్రికెట్ ఈవెంట్ గా  పేరుపొందింది. ఎనిమిది జట్లు ఈ ఈవెంట్లో తలపడుతున్నాయ్. ఇప్పటికే తెలుగు రాష్ట్రం నుండి హైద్రాబాద్ సన్ రైజర్స్ ఈ రేస్ లో ఉంది. అయితే రాష్ట్ర విభజన జరిగి,ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెపరేట్ రాష్ట్రం కావడంతో అక్కడి నుండి  తన భావ గల్లా జయదేవ్  తో కలిసి ఓ టీమ్ ను తీసుకోవాలనుకుంటున్నాడట మహేష్ బాబు.

ipl_cricket_

 

మహేష్ సెట్ చేసుకునే ఐపియల్ టీమ్ కు  వైజాగ్ సిక్సర్  అనే పేరు పెడుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. మహేష్ బాబు భావ గల్లా జయదేవ్  ఎంపిగా ఉన్నారు, దీనికి తోడు ఆయనకు పారిశ్రామిక వేత్తగా మంచి పేరుంది,  మహేష్ కూడా ఇప్పుడే సినీనిర్మాణంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఐపియల్ టీమ్ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారనే సమాచారం అందుతోంది.

అంతా అనుకున్నట్టు జరిగితే  చెన్నై సూపర్ కింగ్స్, ముంబాయ్ ఇండియన్స్, డిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైద్రాబాద్, పంజాబ్ కింగ్స్,రాజస్థాన్ రాయల్స్,బెంగుళూరు రాయల్స్ లతో పాటు మహేష్ బాబు వైజాగ్ సిక్సర్స్ నెక్ట్స్  ఐపియల్ సీజన్లో మనల్ని అలరించనుందన్న మాట!

CLICK: కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా కు ఏమైంది?

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top