దిల్ వాలే ను రిమిక్స్ చేశారు, అందులో మహేష్ బాబు, సమంత, కాజల్, నానీలను ఫిక్స్ చేశారు.!?

మహేష్ బాబు, నాని, కాజల్, సమంతా జంటగా ‘దిల్ వాలే’ చిత్రం తెరకెక్కింది. అదేంటి ‘దిల్ వాలే’ బాలీవుడ్ మూవీ.. అందులో నటించింది షారుఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతిసనన్ లు కదా,,? అనే డౌట్ వచ్చిందా మీకు. ఎస్. మీరు కరెక్ట్ గానే ఉన్నారు. అయితే ఈ మధ్య కొందరు సూపర్ హిట్ సినిమాల ట్రైలర్స్, వీడియోస్ ను ఎడిట్ చేస్తూ తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి, తాము రూపొందించిన వీడియోస్ ను యూట్యుబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు కదా. అలానే తాజాగా షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన లేటెస్ట్ మూవీ దిల్ వాలే’ ట్రైలర్ ను పోలిఉండేలా సూపర్బ్ గా ఎడిట్ చేశాడు సుజాన్ సామ్ అనే ఎడిటర్. ‘దిల్ వాలే’ లో షారుఖ్ తమ్ముడిగా వరుణ్ ధావన్ నటించగా, ఈ ట్రైలర్ లో మహేష్ బాబు తమ్ముడిగా నాని నటించాడు. ‘దిల్ వాలే’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ తో రూపొందిన ఈ ట్రైలర్ యుట్యూబ్ వ్యువర్స్ ని పిచ్చపిచ్చగా ఆకట్టుకుంటోంది.  మహేష్ బాబు ‘దిల్ వాలే’ ట్రైలర్ ఎలా ఉందో మీరూ  ఓ లుక్కెయ్యండి.

Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top