ముఖ్యమంత్రిగా “మహేష్ బాబు” నటించిన “భరత్ అనే నేను” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Sainath Gopi

Movie Title (చిత్రం): భరత్ అనే నేను (Bharat ane nenu)

Cast & Crew:

నటీనటులు: మహేష్ బాబు,కైరా అద్వానీ,ప్రకాష్ రాజ్,శరత్ కుమార్,బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం: కొరటాల శివ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: DVV Entertainments

Story:

ఆక్స్ఫర్డ్ లో చదివి యూకే నుండి ఇండియాకి వచ్చిన భారత్ ని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. తను ఇండియాకి రాగానే తన కుటుంబంకి ఓ చేదు సంఘటన ఎదురవుతుంది. తన తండ్రి (శరత్ బాబు) చనిపోతాడు. అన్యాయయలు, అక్రమాలు ఎక్కువ అవ్వడంతో గాడ్ ఫాదర్ వరద “భారత్” ను ముఖ్యమంత్రిగా చేస్తారు. రాజకీయ చరిత్రలో కొత్త రంగులు నింపుతాడు భారత్. సొసైటీలో ప్రతి ఒక్కరికి బాధ్యత తెలిసేలా చేస్తాడు. అధికార పార్టీ లో ఉన్న మంత్రులు అందరు భారత్ కు ఎదురు తిరుగుతారు. తర్వాత భారత్ వాళ్ళని ఎలా ఎదురుకున్నాడో తెలియాలంటే “భరత్ అనే నేను” సినిమా చూడాల్సిందే.!

Review:

ముఖ్యమంత్రిగా మహేష్ నటన ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కైరా అద్వానీ గ్లామర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. ప్రకాష్ రాజ్, శరత్ బాబు, సితార తమ పాత్రలకు న్యాయం చేసారు. సీఐడీ ఆఫీసర్ గా అజయ్ కూడా ఆకట్టుకున్నాడు. మధ్యలో బ్రహ్మాజీ కామెడీ ఆడియన్స్ ని నవ్వుకునేలా చేస్తుంది. కొరటాల శివ కథను తెరకెక్కించిన విధానం, స్క్రీన్ ప్లే అన్ని ఒక ఎత్తు అయితే…డైలాగ్స్ మరో ఎత్తు. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం అయితే అదుర్స్. సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ కూడా బాగున్నాయి.

Plus Points:

మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించడం
సాంగ్స్ – విసుఅల్స్
స్టోరీ, కాన్సెప్ట్
సెకండ్ హాఫ్ మాస్ సీన్స్

Minus Points:

క్లైమాక్స్

Final Verdict:

ముఖ్యమంత్రిగా అటు మాస్ ఆడియన్స్ ని ఇటు క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు మహేష్.

AP2TG Rating:  3.5 / 5

Trailer:

Comments

comments