మహేష్, నమ్రతల లిప్‌కిస్ పిక్ ని ఎవరు తీసారో తెలుసా ..! ఎలా బయటకి వచ్చింది అంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, తన భార్య నమ్రతను లిప్ టు లిప్ కిస్ చేస్తున్న పిక్ నెట్టింట్లో బాగా వైరల్ అయింది. అయితే ఈ పిక్ మహేష్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారని మాత్రమే తెలుసు. అసలు ఈ పిక్‌ని ఎవరు తీశారు? ఈ పిక్ బయటకు రావడానికి వెనుక ఉన్న విశేషాలేంటో ఎవరికీ తెలియదు. మహేష్ ‘థ్యాంక్యూ మై లవ్’ అంటూ క్యాప్షన్ పెట్టి ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌ను తానే తీశానంటూ మహేష్ స్నేహితుడు క్సేవియర్ అగస్టీన్ తెలిపారు.


నేను నా భార్య సబీనాతో కలిసి ఓ రోజు సాయంత్రం మహేష్ ఇంటికి వెళ్లాను. అక్కడ మేము, మా పిల్లలతో కలిసి టీవీ చూస్తూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పటిలాగే నేను ప్రతి ఒక్కరి క్యాజువల్ ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నా. అదే సమయంలో ఈ లవ్‌లీ హ్యాపీ కపుల్‌కి సంబంధించిన ఈ స్వీట్ క్యాండిడ్ మూమెంట్‌ని నా కెమెరాలో బంధించా’’ అంటూ అగస్టీన్ తెలిపారు. అదన్నమాట అసలు సంగతి. ఈ పిక్ మహేష్‌కి తెగ నచ్చేయడంతో ఆయన తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.

Comments

comments

Share this post

scroll to top