మేరా ధోని…మ‌హాన్. ధోని అన‌గానే నాకు గుర్తుకువ‌చ్చే నాలుగు వీడియోలు.

జుల‌పాల జుట్టుతో…వికెట్స్ వెనుక కీపింగ్ చేస్తున్న‌ప్పుడు….హా.. ఇండియా త‌ర‌ఫున ఎంతో మంది క్రికెట్ ఆడుతుంటారు, పోతుంటారని అనుకున్నాను కానీ…183 ప‌రుగుల‌తో..శ్రీలంకను చిత్తు చిత్తు చేసిందాక తెలియ‌దు. ధోని రేప‌టి భార‌త్ క్రికెట్ వ్య‌వ‌స్థ‌ను శాసిస్తాడ‌ని. 2007 లో ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన‌ప్పుడు….ఇప్పుడిప్పుడే ఆట‌గాడిగా ఎదుగుతున్న… నీకెందుకు భ‌య్యా కెప్టెన్సీలు… నీ ప్యూచ‌ర్ సర్వ‌నాశ‌నం అవుందనుకుంటున్న త‌రుణంలో….జోగింద‌ర్ చెవిలో ఓ మంత్రాన్ని ఊది,జోరు మీదున్న మిస్బాను బోల్తా కొట్టించి, ఫైన‌ల్ లో పాక్ ను చిత్తు చేసి…. ICC తొలి T20 క‌ప్ ను గెలిచి దేశానికి స‌గర్వంగా అందించావ్.

చేజారుతున్నంద‌నుకున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను … పైన‌ల్ మ్యాచ్ లో నీ మాయాజాలాన్ని చూపి..మాకందించావ్. టెస్ట్ లంటే బోర్ అని ఫీల్ అయ్యే మాచేత 5 రోజుల పాటు టెస్ట్ మ్యాచ్ల‌ను టివిల్లో లైవ్ గా చూసేలా చేశావ్. గెల‌వ‌డే క‌ష్ట‌మ‌ని ఫీల‌య్యే స్టేజ్ నుండి….టెస్ట్ ల్లో ఇండియా టాప్ వ‌న్ అని నిరూపించావ్. ఆట‌గాడిగా, కెప్టెన్ గా…నీ ప్ర‌వ‌ర్త‌న, నీ హుందాత‌నం అజ‌రామ‌రం. 2007 ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ క‌ప్,2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఏదీ వ‌ద‌లిపెట్ట‌లేదు…అన్నింటిని అందించావ్. ధ్యాంకూ ధోని, అండ్ మిస్ యూ.

# క్రికెట్ ను మ‌రింత వ‌న్నె తెచ్చిన డైన‌మైట్ ధోని…అన్ని ఫార్మాట్స్ లో కెప్టెన్సీ గా త‌ప్పుకుంటున్నాన‌నే ఆయ‌న‌ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూ..ధోని అన‌గానే నాకు గుర్తుకువ‌చ్చే నాలుగు వీడియోల‌ను మీతో పంచుకుంటున్నాను.
– మీ ధోని అభిమాని.

1)చేతిలో ఒక‌టే వికెట్…6 బాల్స్ లో 15 ర‌న్స్ కావాలి…స్ట్రైకింగ్ లో ధోని, నాన్ స్ట్రైకింగ్ లో ఇషాంత్..ఫ‌స్ట్ బాల్ బీట్ అయ్యింది. స‌మీక‌ర‌ణాలు ఛేంజ్ అయ్యాయ్.5 బాల్స్ లో 15 కావాలి….. ధోని ధ‌నాధ‌న్ దంచుడు స్టార్ట్ చేశాడు.. మ్యాచ్ ఇండియా వ‌శం అయ్యింది.

2) ఆస్ట్రేలియాతో మ్యాచ్ 4 బాల్స్ లో 12 ర‌న్స్ కొట్టాలి, బౌల‌ర్ మంచి జోష్ మీదున్నాడు. అప్ప‌టి వ‌ర‌కూ బ్యాట్స్ మ‌న్స్ పై అత‌నిదే పూర్తి ఆదిప‌త్యం…. ఒక్క సారి గ్లౌజ్స్ సెట్ చేసుకున్న ధోని…సీన్ రివ‌ర్స్ ఇంకో విజ‌యం ఇండియా ఖాతాలో…

3)క‌సి+క్ర‌మ‌శిక్ష‌ణ‌=ధోని…ఇదే ప్రూవ్ అయ్యింది, ప్ర‌పంచ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో…క‌ళ్ళ‌ముందు భారీ ల‌క్ష్యం, స్టార్ బ్యాట్స్మ‌న్స్ అంద‌రూ పెవిలియ‌న్ లో…బాధ్య‌త‌ను త‌న భుజాల‌మీద వేసుకున్నాడు. మంచి బాల్ ను గౌర‌వించ‌డం, చెడ్డ బాల్ ను బౌండ‌రీకి పంపించ‌డం… ఏం జ‌రుగుతుందో తేరుకునే లోపే, మ్యాచ్ ను ప్ర‌త్య‌ర్థుల చేతుల్లోంచి మ‌న వైపు లాగిప‌డేశాడు. 79 బంతుల్లో 91 ప‌రుగులు చేసి మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ ను అందుకొని…120 కోట్ల భార‌తీయుల క‌ల‌ను సాకారం చేశాడు.

4.కెప్టెన్సీ అంటేనే ప‌క్కా ప్లానింగ్…స్కెచ్ వేస్తే…మిస్ కావొద్దు, అస్త్రాన్ని ఉప‌యోగించ‌డం రావాలి, తంత్రాన్ని న‌డిపించ‌డం కావాలి.అదే చేశాడు తొలి ఐసిసి వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో….అనామ‌కుడైన జోగింధ‌ర్ తో బౌలింగ్ చేయించి, లాంగ్ స్లిప్ లో శ్రీశాంత్ ఫీల్డింగ్ పొజీష‌న్ సెట్ చేసి, జోరు మీదున్న మిస్బాను బోల్తా కొట్టించాడు. కొత్త హిస్ట‌రీని క్రియేట్ చేశాడు.

Comments

comments

Share this post

scroll to top