“లాంగ్ హెయిర్” తో మరోసారి “ధోని”.! ధోని ఫాన్స్ ఈ వీడియో తప్పక చూడాలి..!

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అతని పొడవాటి హెయిర్‌ స్టైల్‌.. తరువాత గుర్తుకు వచ్చేది అతని హెలికాప్టర్‌ షాట్లు. ఫార్మాట్‌ ఏదైనా సరే ధోనీ బ్యాటింగ్‌ శైలి వేరేగా ఉంటుంది. ఇతర క్రికెటర్లకు ఇతను భిన్నం. మైదానంలో కెప్టెన్‌గా ఉన్నప్పుడు, లేనప్పుడూ ఎప్పుడైనా ఒకేలా ఉంటాడు. పూర్తిగా కూల్‌ యాటిట్యూడ్‌లో మనకు కనిపిస్తాడు. అయితే ఇప్పుడంటే అతను హెయిర్‌ స్టైల్‌ మార్చాడు కానీ.. ఒకప్పుడు.. అంటే 2007 టీ20 వరల్డ్‌ కప్‌ అప్పుడు అతని హెయిర్‌ స్టైల్‌కు అందరూ ఫిదా అయిపోయారు.

అప్పట్లో టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు మహేంద్ర సింగ్‌ ధోనీ హెయిర్‌ స్టైల్‌ అతని బ్యాటింగ్ షాట్లను చూసిన అప్పటి పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వీజ్‌ ముషారఫ్‌ కూడా ధోనీ హెయిర్‌ స్టైల్‌కు ఫ్యాన్‌ అయ్యాడు. జుట్టు అలాగే పెంచుకోవాలని సలహా ఇచ్చాడు. అయితే 2007 టీ20 వరల్డ్‌ కప్‌లో విజయం అనంతరం అందరూ తన జుట్టుపై ఫోకస్‌ ఎక్కువగా పెట్టే సరికి అది తనకు ఇబ్బందిగా అనిపించి ధోనీ లాంగ్‌ హెయిర్‌ను కాస్తా షార్ట్‌ హెయిర్‌ చేశాడు. అప్పటి నుంచి ఇక ధోనీ హెయిర్‌ స్టైల్‌ గురించి ఎవరూ పట్టించుకోలేదు.

ఆ తరువాత అడపా దడపా ధోనీ తన హెయిర్‌ స్టైల్స్‌ను మార్చాడు. అయినా అవి అంత పెద్దగా ఆకర్షించలేదు. అతని లాంగ్‌ హెయిర్‌ మాత్రమే జనాలను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ధోనీ మరోసారి లాంగ్‌ హెయిర్‌తో కనిపించాడు. కానీ అది ఓ యాడ్‌ కోసమే, అతనేమీ మళ్లీ పాతలా హెయిర్‌ పెంచలేదు. ఓ కంపెనీ యాడ్‌ కోసం లాంగ్‌ హెయిర్‌లో కనిపించాడు. దీంతో ఆ యాడ్‌ ధోనీ అభిమానులను ఆకట్టుకుంటోంది. కావాలంటే మీరూ దానిపై ఓ లుక్కేయవచ్చు.

Comments

comments

Share this post

scroll to top