ఈ పిల్లలు చెప్పిన సమాధానాలు వినండి.. గాంధీ జయంతికి హాలిడే అవసరమా?

హైద్రాబాద్ లోని ఓ కాలనీ పిల్లలందరూ తమ ఏరియా పార్క్ లో చేరి ఆడుకుంటున్నారు. సుమారు మూడు గ్రూపులున్నాయ్, ఎవరి ఆట వారిది. అటుగా వెళుతున్న నాకు వీరి కేరింతలు వినిపించాయ్. పిల్లలంతా తమదైన లోకంలో మైమరిచి ఆడుకుంటున్నారు. నేను అక్కడి వెళ్ళి, వాళ్ళను గమనిస్తూ నిల్చున్న.

కాసేపు తర్వాత, ఓ బాబు ఆటలో అలిసిపోయి పార్క్ లోని చెట్టు కింద కూర్చున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళాను. టైమ్ 10 కావొస్తుంది. తమ్ముడూ ఏం పేరు అన్నాను .అరవింద్ అంటూ చటక్కునా సమాధానం ఇచ్చాడు ఆ పిల్లాడు. టిఫిన్ చేశావా అని అడిగా, లేదన్నా ఈ రోజు హాలిడే కదా మా మమ్మి రెస్ట్ తీసుకుంటున్నారు. డైరెక్ట్ లంచ్ చేస్తేస్తా! ఇది వాడి సమాధానం.

మరికొన్ని ప్రశ్నలు అడిగా ఆ పిల్లాడిని:

 • నా ప్రశ్న: ఈ రోజు సెలవెందుకు?
 • జవాబు: ఈ రోజూ గాంధీ బర్త్ డే. అందుకే హాలిడే.!
 • నా ప్రశ్న: అసలు ఈ గాంధీ ఎవరు? ఆయన బర్త్ డే కు సెలవెందుకు?
 • జవాబు: ఏమో , మేం క్లాస్ లో ఉన్నప్పుడు నోటీస్ వచ్చింది, మా సార్ చదివి రేపు సెలవ్ రా అన్ని చెప్పారు.
 • నా ప్రశ్న: సరే.. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా గాంధీ గురించి తెలుసా? గాంధీ గురించి చెబితే అందరికీ చాక్లెట్లిస్తా?
  (వాడు వెళ్ళి పది మందిని పిలుచుకొచ్చాడు.)
 • నా ప్రశ్న: చెప్పండి.! మీలో ఎవ్వరికైనా గాంధీ గురించి తెలుసా?
 • జవాబు: (అందులో ఒక పిల్లాడు) హా..తెలుసు. గాంధీ తాత. గుండు,కళ్ళజోడు ఉంటుంది. షర్ట్ వేసుకోడు.
 • నా ప్రశ్న: ఇంకా ఏం తెలుసు?
 • జవాబు: శంకర్ దాదా సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. ఆయనే కదా!
 • నా ప్రశ్న: గాంధీ గురించి ఒక్క పాటైనా పాడండి చాక్లెట్లిస్తా? ఎవరైనా.? ఒక్క పాట?
 • జవాబు: హా. నేను పాడతా….. గాంధీ… గాంధీ…గాంధీ…గాంధీ..గాంధీ( పాడాను కదా , అన్నా చాక్లెట్స్ ఇవ్వన్నా)
 • ఇప్పుడు చెప్పండి.! గాంధీ జయంతికి సెలవెందుకు ఇవ్వాలో.. మహనీయుల పుట్టిన రోజులను ఇలా పబ్లిక్ హాలిడేలుగా ప్రకటిస్తే నిజంగా వాళ్ళకు ద్రోహం చేసిన వాళ్ళమవుతాము. భావి తరాలకు వాళ్ళ చరిత్రను అందించని దుర్మార్గులంగా చరిత్రలో నిలిచిపోతాము.

ఆ రోజు ఖచ్చితంగా స్కూల్ ను పెట్టి అందరినీ రమ్మని …అందుబాటులో ఉన్న ప్రముఖులతో మహనీయుల త్యాగాల గురించి, సమాజానికి వారు చేసిన సేవ గురించి , వారి గొప్పతనం గురించి తెలియజేస్తూ పిల్లల్లో స్పూర్తినింపాలి. అలా కాకుండా సండేకు, మహనీయుల బర్త్ డేలకు తేడా లేకుండా హాలిడే అంటే మాత్రం … జాతి క్షమించని నేరాన్ని చేసిన వాళ్ళమవుతాం. బోసినవ్వుల తాతకు ,జాతి మనస్సులు గెలిచిన జాతిపితకు జన్మదిన శుభాకాంక్షలు.

Comments

comments

Share this post

scroll to top