వాయిదా పడిన మహర్షి సినిమా.? బాధ పడుతున్న అభిమానులు, మహర్షి టీం ని తిట్లతో ముంచెత్తుతున్న మహేష్ అభిమానులు.

ఏప్రిల్ 5 న ఉగాది కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రం అయిన ‘మహర్షి’ విడుదల అవుతుందని నిర్మాత దిల్ రాజు ఇది వరకే ప్రకటించాడు, దీంతో తెలుగు కొత్త సంవత్సరాది పండక్కి అభిమానులకు కానుక ఇస్తున్నాడని మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు, కానీ గడిచిన నెల రోజుల నుండి ఈ సినిమా విడుదల పైన రోజుకో మాట వినిపిస్తుంది..

18,20,26…ఎహే జూన్ 5…

ఒక రోజు ఏప్రిల్ 5 అంటారు, ఇంకో రోజు ఏప్రిల్ 20 అంటారు, ఇంకో రోజు ఏప్రిల్ 26 అంటారు. మరికొందరేమో జూన్ 5 న రంజాన్ కానుకగా వస్తుంది రా మూవీ అని అంటారు. అసలు ఇందులో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఫ్యాన్స్ కి అర్ధం కావట్లేదు, ఫ్యాన్స్ ఇంతలా తపిస్తున్నా చిత్ర యూనిట్ స్పందించకపోడం తో అభిమానులు మరింత ఆగ్రహానికి లోనవుతున్నారు

ఏప్రిల్ 25 ఆ ఏప్రిల్ 5 ఆ.?

F2 మూవీ సక్సెస్ అవ్వడం తో తిరుమల స్వామి వారిని దర్శించుకున్నాడు దిల్ రాజు, ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ మహర్షి ఏప్రిల్ 25 న విడుదల అవుతుంది అని అన్నారు, ఏప్రిల్ 5 అనబోయి 25 అన్నాడా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు, ఎందుకంటే ఏప్రిల్ 5 వ తారీఖున బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఆ మరుసటి రోజు ఉగాది పండుగ. సూపర్ స్టార్ 25 వ చిత్రం ప్రెస్టీజియస్ ఫిలిం కావడం తో గత ఏడాది రంగస్థలం కి ఓపెన్ గ్రౌండ్ దొరికినట్టు ఈ ఏడాది మహర్షి కి కూడా దొరుకుతుందని అందరు భావించారు. హిట్ టాక్ వస్తే రికార్డు లు తిరగరాయడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ ఏప్రిల్ 25 అనేసరికి డీలా పడ్డారు .

ఇదే మొదటి సారి కాదు :

ఎండా కాలం లో రావాల్సిన స్పైడర్ సినిమా దసరా కి విడుదల అయ్యింది, సంక్రాంతి కి విడుదల కావాల్సిన భరత్ అనే నేను సినిమా ఎండా కాలం లో విడుదల అయ్యింది, ఇలా ఫ్యాన్స్ మనోభావాలతో ఎప్పటికప్పుడు ఆడుకుంటూనే ఉన్నాడు సూపర్ స్టార్. వారి అభిమాన హీరోకి సరైన రిలీజ్ డేట్ దక్కకపోతే కచ్చితంగా బాధ పడతారు, సంక్రాంతి సెలవులకి ఎన్ని సినిమాలు వచ్చినా హిట్ టాక్ వస్తే అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి, కానీ పండుగ సీజన్లో కాకుండా మాములు రోజుల్లో అంటే హిట్ టాక్ వచ్చిన మాములు కలెక్షన్స్ ఏ వస్తాయి.

అభిమానుల మాట వింటాడా ఇకనైనా.?

అయితే ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది మాత్రం మహర్షి వాయిదా పడటానికి కారణం డైరెక్టర్ వంశీ పైడిపల్లి అనే చెబుతున్నారు, పైడిపల్లి కనుక అనుకున్న సమయానికి మూవీ ని పూర్తి చెయ్యగలిగితే ఏప్రిల్ 5 వ తారీకునే విడుదల చేస్తారని చెబుతున్నారు, అభిమానుల కోరిక మేరకు ఏప్రిల్ 5 న విడుదల చేస్తారో, లేక అలాగే వారి మాటను ఎప్పటిలాగే దాటేసి వారిని నిరాశపరుస్తాడో సూపర్ స్టార్ మహేష్ చేతిలోనే ఉంది.

Comments

comments

Share this post

scroll to top