రేపే విడుదల కానున్న మహానాయకుడు సినిమా, బాలకృష్ణ గారికి బాక్స్ ఆఫీస్ విజయం దక్కుతుందా.?

అన్న గారి బయోపిక్ అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి, అంచనాలు ఎక్కువ ఉండటం తో ఆ అంచనాలు అందుకోలేక కథానాయకుడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది, కానీ మహానాయకుడు సినిమా మీద అంతగా అంచనాలు లేకపోడం తో సినిమా యావరేజ్ గా ఉన్నా మంచి విజయం సాధించే అవకాశం పుష్కలంగా ఉంది.

రానా నే సూత్ర దారి.. :

చంద్రబాబు నాయుడు గారి పాత్ర లో దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. మహానాయకుడు సినిమా లో రానా క్యారెక్టర్ ముఖ్యమైనది, రానా బాలకృష్ణ గారి మధ్య సన్నివేశాల కోసం జనాలు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు, కథానాయకుడు అంత భారీ స్థాయి లో రిలీజ్ కాకపోయినా, దాదాపు అన్ని ఊర్లల్లో మహానాయకుడు రిలీజ్ అవుతుంది, F2 చిత్రం మినహాయిస్తే మారే చిత్రం పెద్దగా బాక్స్ ఆఫీస్ పైన ఇంపాక్ట్ చూపియ్యలేదు ఈ సంవత్సరం, బాక్స్ ఆఫీస్ దెగ్గర యాత్ర ఫర్వాలేదనిపించినా… Mr.మజ్ను, వినయ విధేయ రామ చిత్రాలు నిరాశ పరిచాయి. ప్రస్తుతం పోటీ కూడా లేదు, మహానాయకుడు సినిమాకి పోటీ గా విడుదలవుతున్న మిఠాయి చిత్రం పైన జనాల్లో హైప్ లేదు, హిట్ టాక్ వస్తే మిఠాయి మూవీ కి కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మహానాయకుడు చిత్రానికి ఇంతకంటే మంచి తరుణం మళ్లీ దొరకదు విడుదలకి. హిట్ టాక్ వస్తే కథానాయకుడికి నష్టపోయిన వాళ్ళని మహానాయకుడు చిత్రమే ఆదుకుంటుంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపం లో.. :

మహానాయకుడు సినిమా ని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వెంటాడుతూ ఉంది, రెండు సినిమాలు రాజకీయాల మీదనే వస్తుండటం, రెండు సినిమాలు అన్నగారి మీదనే అయి ఉండటం కొసమెరుపు, రెండు చిత్రాల్లో ఏ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారనేది వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top