మ‌హాన‌టి సినిమా రివ్యూ & రేటింగ్

Cast & Crew:

న‌టీన‌టులు. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత ,విజయ్ దేవకొండ
ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్
మ్యూజిక్ మిక్కిజే మేయర్
నిర్మాత ప్రియాంక ద‌త్, అశ్విని ద‌త్ ,స్వ‌ప్న ద‌త్.

STORY:
ప్ర‌జావాణి అనే ప‌త్రిక‌లో జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేస్తున్న మ‌ధుర‌వాణి( స‌మంత‌) కు…. కోమాలో ఉన్న హీరోయిన్ సావిత్రి కు సంబంధించిన వార్త‌ను అప్ప‌గిస్తాడు ఎడిట‌ర్. ఫోటోగ్రాఫ‌ర్ అంటోని( విజ‌య్ దేవ‌ర‌కొండ ) ని కూడా అదే వ‌ర్క్ ను అసైన్ చేయ‌డం జ‌రుగుతుంది.! .మ‌ధుర‌వాణి సావిత్రి కి సంబంధించిన జీవిత విష‌యాల‌ను తెలుసుకునే క్ర‌మంలో….. సావిత్రితో ప‌రిచ‌య‌మున్న కొంత మందిని క‌లవ‌డం జ‌రుగుతుంది. వారి ద్వారా తెలుసుకున్న అస‌లు విష‌యాలే సినిమా…. క‌థ‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నంలోనే మధుర‌వాణి, ఆంటోనీలు కూడా ప్రేమ‌లో ప‌డ‌తారు.

REVIEW:
తండ్రిలేని పిల్ల‌గా సావిత్రి గ‌డిపిన విధానం, నాట‌కాల్లో వేషాలు వేస్తూ చెన్నై వెళ్ళి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన విధానం…ఈ క్ర‌మంలో అప్ప‌టికే వివాహ‌మై ఇద్ద‌రు పిల్ల‌లున్న జెమినీ తో వివాహం..ఇగో ప్రాబ్ల‌మ్ వ‌ల్ల భార్య ఉన్న‌తిని త‌ట్టుకోలేని గ‌ణేష‌న్ పూర్తి స్థాయిలో చెడు వ్య‌స‌నాల‌కు లోన‌వ్వ‌డం….అది త‌ట్టుకోలేని సావిత్రి కూడా తాగుడుకు బానిస‌వ్వ‌డం, లెక్క‌కు మించి ధాన‌ద‌ర్మాలు చేయ‌డం…చివ‌ర‌కు ఓ నిస్సహయురాలిగా కోమాలోకి వెళ్ళ‌డం ఇదంతా తెలిసిన క‌థే అయిన‌ప్ప‌టికీ….సినిమాను తెర‌కెక్కించిన విష‌యంలో మాత్రం ద‌ర్శ‌కుడిని ఎంత పొగిడినా త‌క్కువే… ఓ బ‌యోపిక్ ను బోర్ కొట్టించ‌కుండా…..గ్యాప్ లో ఫ‌న్ ను జెన‌రేట్ చేస్తూ….క్యూరియాసిటీని ఎక్క‌డా త‌గ్గించ‌కుండా సినిమాను మ‌లిచిన విధానం రియ‌ల్లీ హ్యాట్సాఫ్‌.

PLUS
కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ వీరిద్ద‌రూ పోటీ ప‌డి న‌టించారు.
స్క్రీన్ ప్లే
డైరెక్ష‌న్
మ్యూజిక్

VERDICT నిజంగా మ‌హాన‌టే.
RATING 4/5
TRAILER:

Comments

comments

Share this post

scroll to top