సోషల్ మీడియాలో వైరలవుతున్న మహానటి డిలీటెడ్ సీన్..!

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి,తెలుగు,తమిళంలో విజయవంతంగా దూసుకుపోతుంది..ఎలాంటి వివాదాలకు తావులేకుండా బ్యాలన్స్డ్ గా తెరకెక్కించడంలో నాగ్ అశ్విన్ సఫలీకృతుడయ్యాడు..సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ ఒదిగిపోయింది..కీర్తా అంటూ పెదవివిరిచిన వారే ,ఏంటి ఈ పిల్లకు సావిత్రమ్మ పూనిందా అంటూ మెచ్చుకుంటున్నారు..అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంభందించిన డిలీటెడ్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మాయాబజార్ సినిమాలో  శశిరేఖగా సావిత్రి నటించిన విషయం  తెలిసిందే..శశిరేఖ  పాత్రలో సావిత్రి అభినయం అమోఘం అనే చెప్పాలి.ఆ సినిమాకు సంభందించే ప్రియదర్శిని పేటిక ముందు  కీర్తి సురేష్ మాట్లాడిన క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఇలాంటివి నిజంగా ఉంటే బాగుండు.. వేరే షూటింగ్‌లో ఉన్న మా ఆయనతో ఎంచక్కా మాట్లాడుకోవచ్చునంటూ” కీర్తి చెప్పడం , మీ ఆయనతో తర్వాత మాట్లాడుదువు ఇప్పుడు నాగేశ్వర్రావు తో మాట్లాడు అని దర్శకుడు కెవి రెడ్డి పాత్రధారిగా క్రిష్   అనడం..ఈ డిలీటెడ్ సీన్లో సన్నివేశం.

సావిత్రి,జెమిని గణేశన్ ల పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా జెమినితో వివాహబంధానికే పరిమితం అయిపోవాలనుకున్న తర్వాత చేసిన సినిమానే మాయాబజార్..అప్పటి వరకు తమ వివాహ విషయం గుట్టుగా ఉంది కాబట్టి ఎక్కడా ప్రస్తావన లేదు..ఈ సినిమా టైంకి వారిద్దరి వివాహం గురించి అందరికి తెలిసిన విషయమే కదా అని ఈ సీన్ పెట్టుంటారు..కీర్తి చమత్కారం గా అన్నా కూడా,సావిత్రిగారి అమాయకత్వం,అల్లరి తెలిసినవారికి ఆ సన్నివేశం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top