మీ అకౌంట్లో 100 రూపాయాలున్నాయా..? అయితే వెంటనే మీ డెబిట్ కార్డ్ ను ఏటియం లో పెట్టి 100 డ్రా చేయండి.. 100 కు బదులు 500 రూపాయల నోటు మీ చేతికొస్తుంది. ఇలా రావాలంటే మీ పక్కనున్న ఎటియం కు వెళ్తే కుదర్దు.. బస్ ఎక్కి త్వరగా మెదక్ జిల్లా నర్సాపూర్ కు వెళ్ళాలి.. అక్కడ మాత్రమే ఈ ఫెసిలిటి అవెయిలబుల్ గా ఉంది.

నిజమా..? కాదా అనే షాక్ లో ఉన్నారా..? ఇప్పటికే ఆ ఏటియం షాక్ ఆ ఊరు వాళ్లందికీ తగిలింది. ఇప్పుడు ఈ విలేజ్ వాళ్లంతా ATM కార్డ్ పట్టుకొని టాటా ఇండిక్యాష్ ఏటీఎం దగ్గర లైన్లు కట్టారంట! ఇప్పుడు అసలు విషయం లోకి వద్దాం.. నర్సాఫూర్ కు చెందిన ఒక వ్యక్తి 100 రూపాయలు అవసరం ఉండి, బస్టాండ్ కు దగ్గర్లో ఉంటే టాటా ఇండిక్యాష్ ATM దగ్గరకు వెళ్లి.. 100 డ్రా చేశాడంట, కానీ సడెన్ గా500 వచ్చి చేతిలో పడ్డాయంట.. ఈ విషయం ఎలా పాకిందో కాని ఊరంతా వ్యాపించింది.
దీంతో చిన్న ,చితక అంతా డెబిట్ కార్డులు పట్టుకొని ఈ ఎటియం ముందు క్యూలు కట్టారంట, విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. ఏదైతేనేం ఇలాంటి ఎటియం లు నిజంగానే ఉంటే…దబిడిదిబిదే…..!! ఇది విన్నాక ఇప్పుడు మెదక్ వెళ్లాలని బస్ ఎక్కేరు… ఇప్పటికే ఆ ATM ఖాళీ అయి ఉంటుంది. LOL.