మరోసారి “మ్యాగీ నూడుల్స్” ప్రియులకు పెద్ద షాక్..! ఈ సారి 45 లక్షల ఫైన్.. ఎందుకో తెలుసా..?

అప్పట్లో నెస్ట్లీ కంపెనీకి చెందిన మ్యాగీ నూడుల్స్‌పై నెలకొన్న వివాదం గుర్తుందా..? చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. 2015వ సంవత్సరంలో ఈ వివాదం వచ్చింది. మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకి మించి మోనోసోడియం గ్లూటమేట్‌ (ఎంఎస్‌జీ) అనే పదార్థం కలుస్తుందని తెలిసింది. తెలియడమే కాదు, దీనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే టెస్ట్‌లు చేసిన సంబంధిత అధికారులు మ్యాగీ నూడల్స్‌లో ఎంఎస్‌జీ మోతాదుకు మించి ఉందని గుర్తించారు. దీంతో మ్యాగీ నూడుల్స్‌ను దేశంలో బ్యాన్‌ చేశారు. తరువాత ఎలాగో నెస్ట్లీ కంపెనీ కష్టపడి మళ్లీ అన్ని టెస్టులను పాసై తిరిగి తన మ్యాగీ నూడుల్స్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. అయితే అంతా సజావుగా ఉందనుకున్న తరుణంలో ఇప్పుడు ఆ కంపెనీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా మళ్లీ నూడుల్స్‌ విషయంలోనే కావడం విశేషం. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించి యాష్‌ (బూడిద) ఉందని తెలిసింది. గత నెల కిందట ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో మ్యాగీ నూడుల్స్‌ విక్రయిస్తున్న పలు షాపులపై అధికారులు దాడి చేసి నూడుల్స్‌ శాంపిల్స్‌ను తీసుకున్నారు. వాటిని టెస్ట్‌ చేయగా ఆ నూడుల్స్‌లో నిజంగానే మోతాదుకు మించి బూడిద కలుస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆ జిల్లా కోర్టు నెస్ట్లీ ఇండియాకు రూ.45 లక్షల జరిమానా వేసింది. సదరు కంపెనీకి చెందిన ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున ఫైన్‌ వేయడంతోపాటు ఆ నూడుల్స్‌ను విక్రయించిన మరో ఇద్దరు విక్రయదారులపై కోర్టు రూ.11 ల‌క్ష‌ల ఫైన్‌ వేసింది.

అయితే దీనిపై నెస్ట్లీ ఇండియా స్పందిస్తూ తమకు ఇంకా ఈ విషయం గురించి తెలియదని, ఆర్డర్లు వస్తే స్పందిస్తామని దీనిపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. అవున్లే.. ఇంకా ఏం చేస్తారు.. ఏది ఏమైనా తమ కంపెనీ ఉత్పత్తులను అమ్ముకోవడమే ఇలాంటి వారికి పరమావధి. వారికి జనాల ఆరోగ్యంతో పని ఏముంటుంది. జనాలు ఏమై పోయినా పట్టించుకోరు. వారికి డబ్బు మాత్రమే కావాలి. కానీ మనం కూడా కొంచెం ఆలోచించాలి. ఇలాంటి ఉత్పత్తులను తినే ముందు ఒకసారి ఇప్పటికైనా ఆలోచించుకోండి. తరువాత మన ఆరోగ్యం పాడైతే బాధపడాల్సింది మనమే. ఆ కంపెనీ వారు కాదు.

Comments

comments

Share this post

scroll to top