మగవారితో సమానంగా పనిచేస్తున్నమహిళకుటుంబ పోషణ కోసం ఆ అవతారం ఎత్తిన వీరనారి.మహిళలకు ఏది కష్టం కాదు అని నిరూపించింది!!

మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. విమాన పైలట్లుగా, ట్రైన్ డ్రైవర్లుగా,IAS, IPS,లుగా రాజకీయాల్లోనూ మహిళలు ముందుంటున్నారు.మగవారికి మహిళలు ఎందులోను తీసిపోరనేది వాస్తవం.కానీ కొన్ని రంగాల్లో మహిళలు పని చేయలేరు. అలాంటి ఓ రంగమే మెకానికల్. అయితే ఆ రంగంలో కూడా రాణిస్తుంది ఓ వీరనారి. అయితే ఆమె తన ఇంట్రస్ట్ తో వచ్చిందా. లేదా మరేమైన కారణాలున్నాయా అనేది తెలుసుకుందాం.

అది మధ్యప్రదేశ్‌లోని మంద్సోర్ గ్రామం. రోడ్డు పక్కన ఉన్న ఓ మెకానిక్ షాపులో ఓ మహిళ బిజీగా పని చేస్తుంది. బరువైన లారీలు, ట్రాక్టర్ల చక్రాలకు రిపేర్లు చేస్తున్నారు. పురుషులు కూడా కష్టoగా చేసే ఈ పనిని. ఈ మహిళ మాత్రం ప్యాంటు, షర్టు వేసుకొని కష్టమైన పనిని కూడా ఇష్టoగా చేస్తుంది.

ఆమె పేరు మైన. తండ్రి టైర్లు పంచర్లు చేసేవాడు. తండ్రి దగ్గరే ఈ విద్యను నేర్చుకుంది మైన. ఆ తరువాత ఆమెకి పెళ్లి చేశారు. పెళ్లయ్యాక ఆమె వాళ్ళ అత్త గారింటికి వెళ్ళిపోయింది. పెళ్లి తరువాత ముగ్గురు పిల్లలు అంతలో భర్త చనిపోవడం జరిగింది. ఆమె చేసే పనుల లాగానే .. ఆమె జీవితం కూడా చాలా కష్టంగా మారిపోయింది. పిల్లలను పోషించడానికి మైనా ఈ వృత్తిలోకి వచ్చారు. తన తండ్రి దగ్గర నేర్చుకున్న పనే ప్రస్తుతం ఆమెకు జీవనాధారం అయ్యింది.

ఈ వృత్తిలో మైనా కోనసాగబట్టి దాదాపు 30 ఏళ్లు గడిచిపోయాయి. టైర్లు రిపేరు చేస్తూ..వాటికి గ్రీజ్ రాసేది. ఈమధ్యనే కార్ల సర్వీస్ సెంటర్ కూడా ప్రారంభించింది.రెండు పనులను తను ఒక్కతే చూసుకుంటుంది.

అయితే తన భర్త చనిపోయినపుడు పిల్లలు చాలా చిన్నవాళ్లు. ఒకరికి ఐదేళ్లు, మరొకరికి నాలుగేళ్లు, చిన్నదానికి మూడేళ్లు. దింతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉండేది. మైనా భర్త కాలం చేసిన తర్వాత వాళ్ళ అమ్మతో కలిసి ఉండేది. కానీ మైనాకి ఆమె తల్లికి ఎప్పుడు గొడవలవ్వుతూ ఉండేవి. విసుగు చెంది పిల్లలను తీసుకుని బయటకు వచ్చేసి రోడ్డు పక్కనే కొన్ని బోర్డులతో ఇల్లు ఏర్పాటుచేసుకుంది. ఇక్కడ వచ్చిన కొత్తలో ఆమె అష్టకష్టాలు పడింది. తినడానికి ఏమీలేక, చాలా సార్లు అటుకులు తింటూ కాలం వెళ్లదీసింది.

ఎప్పుడైతే పంచర్ షాప్ పెట్టిందో అప్పటి నుంచి కుటుంబం గడుస్తుంది.పిల్లల్ని మంచిగా చూసుకుంటుంది. ఆడది సంపాదిస్తుంటే అక్కడున్న కొందరి కళ్ళు ఓర్వలేదు. ఆమె ఎదుగుదలకు అడ్డుపడుతూ ఆమెనుఎన్నో అవమానాలకు గురి చేశారు.

మైనా చేసే పని ఆమెకి చాలా కష్టం. వేరే ఆడదైతే ఈ పని చేయకపోవు కావచ్చు. ఆమెకి బాగా పని చేసినప్పుడు వెన్నెముక దగ్గర నొప్పి పుడుతుంది. అయిన కూడా రెస్ట్ తీసుకొడు.నొప్పి మరీ ఎక్కువుంటే కాసేపు పడుకుని మళ్లీ లేచి పని చేస్తుందట మైనా.

మైనా దగ్గరికి వచ్చే వాళ్లలో 80 శాతం మంది మంచివాళ్ళు అయితే 20 శాతం మంది చెడ్డవాళ్ళు వస్తారాంట. కొందరు ఆమె దిక్కు అసబ్యంగా చూస్తూ ఉంటారు అయిన ఆమె తన పని తాను చేసుకుపోతుంది.

ఆమెకి టైరు రిపేరు చేస్తే వంద రూపాయలు వస్తాయి. పది టైర్లు వస్తే, రోజుకు వెయ్యి రూపాయలు వస్తుంది. కానీ ఈ కాలంలో ఈ వెయ్యి రూపాయల సంపాదనతో పిల్లల్ని పెంచడం, ఇంట్లో ఖర్చులకు కూడా సరిపోవడం లేదంట.

Comments

comments

Share this post

scroll to top