మ‌ద్యం తాగేవారైనా, తాగ‌క‌పోయినా.. ఈ విష‌యం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి.. అదేమిటంటే…!

నిత్యం విప‌రీతంగా మ‌ద్యం సేవించే వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో మ‌న‌కు తెలిసిందే. అలాంటి వారికి రోజూ మ‌ద్యం కావ‌ల్సిందే. దొర‌క్క‌పోతే అప్పు చేసి తాగుతారు. లేదంటే ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు. ఇక అలాంటి వ్యక్తుల పిల్ల‌లకు మాత్రం విపరీత‌మైన భ‌యం ఉంటుంది. త‌మ తండ్రి అంత‌లా తాగుతుంటే అత‌ను ఏమైపోతాడోన‌నే కంగారుతోపాటు త‌మ భ‌విష్య‌త్తు ఏమ‌వుతుంద‌నే ఆందోళ‌న కూడా వారిలో ఉంటుంది. ఈ క్ర‌మంలో వారు పెద్ద వాడైన తండ్రికి చెప్పుకోలేక మాన‌సిక క్షోభ‌ను అనుభ‌విస్తారు. తాము భ‌ద్రంగానే ఉన్నామ‌న్న న‌మ్మ‌కం వారిలో పోతుంది. త‌మ తండ్రి పట్ల వారికి ద్వేషం, అస‌హ‌నం ఏర్ప‌డుతాయి.

తాగుబోతులైన తండ్రి వ‌ల్ల అత‌ని పిల్ల‌ల్లో పూర్తిగా అభ‌ద్ర‌తా భావం ఏర్ప‌డుతుంది. వారు నిరంత‌రం భ‌ద్ర‌త కోసం ఎదురు చూస్తుంటారు. దీంతోపాటు పూర్తిగా నిర్ల‌క్ష్యానికి గుర‌వుతారు. ఇత‌ర పిల్ల‌ల తండ్రులు మంచిగా ఉంటే ఆ ప్ర‌భావం కూడా అలాంటి తాగుబోతు తండ్రుల పిల్ల‌ల‌పై ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే ఇదే విష‌యాన్ని నిరూపించ‌డం కోసం బెథ్ ఇజ్రాయిల్ మెడిక‌ల్ సెంట‌ర్, అమెరికా వారు, బోస్ట‌న్ పిల్ల‌ల వైద్య‌శాల‌ల ప‌రిశోధ‌కులు పరిశోధ‌న‌లు చేశారు. దీంతో వారు ఏం చెబుతున్నారంటే…

త‌ల్లిదండ్రులు మ‌ద్యం, డ్ర‌గ్స్ సేవించే వారు అయినా లేదా వాటిని అమ్మే, స‌ర‌ఫ‌రా చేసే వృత్తిలో ఉన్నా అలాంటి వారి పిల్ల‌లు శారీర‌క స‌మ‌స్య‌ల‌తోపాటు మాన‌సికంగానూ ఇబ్బందుల‌కు గుర‌వుతార‌ని స‌ద‌రు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. సాధార‌ణ పిల్ల‌ల కంటే అలాంటి త‌ల్లిదండ్రులు ఉన్న పిల్ల‌లు నాలుగు రెట్లు అధికంగా నిర్ల‌క్ష్యానికి గుర‌వుతార‌ట‌. ఇక ఇలా నిర్ల‌క్ష్యానికి గుర‌య్యే పిల్ల‌ల్లో ప్ర‌వ‌ర్త‌న కూడా మారుతుంద‌ట‌. ఏదైనా ఒక ఇంట్లో ఇక వ్య‌క్తి మ‌ద్యానికి బానిస అయితే అత‌నితోపాటు అత‌ని త‌రువాత త‌రం కూడా తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ట‌. ఇదే విష‌యాన్ని మ‌ద్యానికి బానిసైన వారికి తెలియ‌జేయాల‌ని స‌ద‌రు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. సాధార‌ణంగా చాలా మంది రెగ్యుల‌ర్‌గా తాగేవారుండ‌రు. ఎప్పుడో ఒక‌సారి మ‌ద్యం సేవించే వారు కూడా ఉంటారు. అయిన‌ప్ప‌టికీ అలాంటి వారి పిల్ల‌ల్లోనూ పైన చెప్పిన విధంగా స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. క‌నుక ఎవ‌రైనా స‌రే మ‌ద్య‌పానం మానేయ‌డం మంచిది. లేదంటే పిల్ల‌ల భ‌విష్య‌త్ ప్ర‌మాదంలో ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది.

 

Comments

comments

Share this post

scroll to top