BREAKING NEWS: జూనియర్ ఎన్టీఆర్ కు ఆక్సిడెంట్…! మద్యం మత్తులో హోటల్ రూమ్ లో జారి పడి..?

“బాహుబలి” అనంతరం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ను, నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీయార్ ను కలిపి ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫోటోషూట్ కోసం ఎన్టీయార్ ఇటీవల చరణ్ తో కలిసి అమెరికా వెళ్ళడం తెలిసిందే. సినిమాలో లుక్ కోసం టెస్ట్ షూట్ చేయాలనుకొన్నాడు రాజమౌళి. అయితే.. ఆ షూట్ కి ముందు ఒక పార్టీలో ఎన్టీయార్ మద్యం సేవించి తన హోటల్ రూమ్ లో కాలు జారి పడి గాయాలపాలయ్యాడని తెలుస్తోంది.

నిజానికి త్రివిక్రమ్ సినిమా మొదలవ్వడానికి ముందు రాజమౌళి సినిమా లుక్ కోసం టెస్ట్ ఏంటీ అని అందరూ అనుకొన్నారు. అయితే.. ఎన్టీయార్ స్లిమ్ లుక్ తో ఒక టెస్ట్ షూట్ చేసి అనంతరం త్రివిక్రమ్ సినిమా అయిపోయాక ఇంకోసారి షూట్ చేద్దామనుకొన్నాడట రాజమౌళి. అయితే.. ఇప్పుడు ఎన్టీయార్ దెబ్బలతో అమెరికాలో మంచమెక్కడంతో రాజమౌళి ప్లాన్ అప్సెట్ అయ్యింది. దాంతో రామ్ చరణ్ కి సపరేట్ ఫోటోషూట్ చేస్తున్నాడట.  ఎన్టీయార్ మళ్ళీ సెట్ అవ్వడానికి ఒక రెండు రోజులు పట్టే అవకాశం ఉందట.

Comments

comments

Share this post

scroll to top