మాధురి దీక్షిత్ నూడిల్స్ యాడ్ కు నోటీసులు…!!!

ఆకలిగా ఉందా?  అయితే  రెండు నిమిషాల్లో మ్యాగీ  అంటూ అలరించిన మాదురీ దీక్షిత్ కు ఉత్తరప్రదేశ్ ఆహార, ఔషధ సంస్థ నోటీసులు జారీచేసింది. మ్యాగీ నూడుల్స్‌లో మోనో సోడియం గ్లూటామేట్‌ (ఎంఎస్ జీ) ఉందంటూ..  అటువంటి   మ్యాగీ  ప్రమోషన్ లో ఎలా నటించారు అంటూ ప్రకటనలో కనిపించిన మాధురీ పదిహేను రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో ఈ బాలీవుడ్‌ నటిపై కేసు నమోదు చేస్తామని యూపీ ఆహార భద్రత అధికారి మహిమానంద్‌ జోషి తెలిపారు.

మరోవైపు, మ్యాగీలో పరిమితికి మించి అనారోగ్యకారకాలున్నాయంటూ.. వస్తున్న ఆరోపణల విషయంలో నెస్ట్లె ఇండియాపై విచారణ జరిపించాలని.. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థను కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఆదేశించారు. దీంతోపాటు.. జాతీయ వినియోగదారుల వివాదాలు, పరిహారాల సంస్థ (ఎన్సీడీఆర్సీ)తో ‘క్లాస్‌ యాక్షన్‌ సూట్‌’ దాఖలు చేయించాలన్నారు. అయితే తమ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను నెస్ట్లె ఇండియా ఖండించింది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top