అంతా తూచ్..తుదిశ్వాస వరకు శ్రీకాంత్ తోనే జీవితమంటూ మధుప్రియ ఫైనల్ టచ్.

అనేక ట్విస్టులిచ్చిన మధుప్రియ, శ్రీకాంత్ ల మ్యాటర్ చాలా కూల్ గా సెటిల్ అయ్యింది. మూడు రోజుల నుండి పరస్పర ఆరోపణలతో మీడియాకెక్కిన ఇద్దరు ఒకటైపోయారు జీవితాంతం ఒకర్ని విడిచి ఒకరం ఉండమంటూ మళ్లీ అదే మీడియా సాక్షిగా సెలవిచ్చారు. మూడు రోజుల క్రితం భర్తతనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడంటూ కేసు నమోదు చేసిన మధుప్రియ…ఆ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాంత్ ను ఘాటుగానే విమర్శించింది.  పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత మెత్తపడ్డ మధుప్రియ తన చివరి శ్వాస వరకు శ్రీకాంత్ తోనే ఉంటానని తెలిపింది.

మధుప్రియ శ్రీకాంత్ ల పెళ్లి ఎన్ని ట్విస్ట్ ల మద్య జరిగిందో..?ఈ గొడవ కూడా అంతకు మించిన ట్విస్ట్ లతో సాగి చివరకు పుల్ స్టాప్ పడింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఓ రెండు పేరు మోసిన ఛానల్స్ మాత్రం….. లైవ్ షోలో దంపతులను కూర్చోబెట్టి బతుకు జట్కా బంటి లాంటి ప్రోగ్రామ్ నే నడిపించారు.. ఫైనల్లీ వాళ్లను కలిపేశారు. ఇకమైన కోపాలు తగ్గాయనుకోవాలా…? లేక మళ్ళీ మీడియాలకెక్కుతారా? అనేది చూడాలి…. మెచ్యురిటీ లేని కారణంగా  మ్యాటర్ ఈ స్థాయికి వెళ్లిందనేది మాత్రం వాస్తవం.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top