ఈ రోజు సాయంత్రమే మధు ప్రియ పెళ్ళి ,చేసేదేమీ లేక వెళ్ళిపోయిన తల్లీదండ్రులు.!!

ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లుగా సాగుతున్న మధుప్రియ పెళ్ళి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. ఉదయం వరకు పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ పేరుతో నానిన మధుప్రియ ప్రేమ పెళ్ళి వ్యవహారం లో క్లారిటీ వచ్చింది. అనుకున్నప్రకారమే ఈ రోజు సాయంత్రం తను ప్రేమించిన శ్రీకాంత్ తో మధుప్రియ పెళ్ళి జరగనుంది. కానీ దీనికి ముందు అనేక ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.

నెల క్రితమే  మధుప్రియ 18 యేళ్ళు నిండాయని ..ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న ఆమె నిర్ణయం సరైనది కాదని , ఇప్పుడు ఆమె కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మధుప్రియ తల్లీదండ్రులు ఈ పెళ్లిని వ్యతిరేఖిస్తూ వచ్చారు. చివరకు తమ పెళ్ళి రోజైన నవంబర్ 18 న పెళ్ళి చేస్తామని చెప్పినప్పటికీ కూడా మధుప్రియ తన పట్టు విడవలేదు. దీంతో చేసేదేమీలేక పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయారు మధుప్రియ తల్లీదండ్రులు. దీంతో అనుకున్న ముముర్తానికి మధుప్రియ శ్రీకాంత్ ల పెళ్ళి జరుగుతుందని సమాచారం.

అయితే  శ్రీకాంత్ తో మధు ప్రేమ వ్యవహారం రెండేళ్ళుగా సాగుతుందని…. నెల క్రితమే మేజర్ అయిన మధు  శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దాంతో వారం క్రితమే ఎంగేజ్మెంట్ కావడం ఈ రోజు పెళ్ళి పిక్స్ అవ్వడం చకాచకా జరిగిపోయాయి.  వీళ్ల పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో  వీరి ప్రేమ పెళ్ళి వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరింది.  పెళ్లికి తొందరపడకుండా మధుప్రియ ఇంకాస్త ఆగాల్సి ఉండేదని..ప్రజెంట్ కెరీర్ మీద దృష్టి పెడితే బాగుంటుందని చాలా మంది సూచిస్తున్నారు. ఆమె ప్రాబ్లమ్స్ ఆమెవి….. ఎనీ హౌ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.

For More Details Click Here: Madhupriya

12065730_921363217952158_5884996867894439905_n

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top