పోలీసు స్టేషన్‌కు చేరిన సింగర్ మధుప్రియ ప్రేమ వ్యవహారం.!

ఆడపిల్లనమ్మా పాట ఫేమ్ మధుప్రియ ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది.  ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన బంగి శ్రీకాంత్‌తో మధుప్రియ ప్రేమ వ్యవహారం రెండేళ్లుగా సాగుతోంది. ఈ మద్యకాలంలోనే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. అయితే  వీళ్ళ పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని చెప్పారు. అయినా వాళ్ళ మాట వినని మధుప్రియ  పెళ్లివైపే మొగ్గుచూపింది. దీంతో మధుప్రియ బంధువులు శ్రీకాంత్ ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి అంగీకరించేది లేదని, పెళ్లి జరగనివ్వబోమని  మధుప్రియ తల్లీదండ్రులు శ్రీకాంత్ ఇంటి ముందు గొడవ చేసినట్టు శ్రీకాంత్ తరఫువాళ్ళు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.
అనంతరం ప్రేమజంట కాజగ్ నగర్ DSP ని ఆశ్రయించారు.వాళ్ళకు కౌన్సెలింగ్  ఇచ్చిన పోలీసులు మేజర్లు కావడంతో వారి పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.మధుప్రియ కుటుంబం హైదరాబాద్‌లోని న్యూ  నల్లకుంటలో నివాసం ఉంటుంది. అక్కడే ఆమెకు శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. వీరి పెళ్ళికి సంబంధించిన  శుభలేఖలు కూడా ప్రింట్ అయిపోయాయ్.

Watch Full News Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top