మళ్లీ వార్తల్లోకి మధుప్రియ..KCR ఆదుకోవాలి అంటూ విజ్ఞప్తి.!

ఈ మద్యకాలంలో తరచూ వార్తల్లో  నిలుస్తున్న మధుప్రియ మరో మారు వార్తల్లోకెక్కింది. తనను కెసీఆర్ యే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. మధుప్రియ ప్రేమ వివాహం, తర్వాత భర్త పై కేసు పెట్టడం తర్వాత తల్లీదండ్రులే అంతా చేశారంటూ వివరణ ఇవ్వడం పెద్ద హై డ్రామానే నడిచింది. అదంగా గతం ఇప్పుడు భర్త శ్రీకాంత్ తో హ్యాపీగా ఉంటుంది మధు ప్రియ. ప్రస్తుతం తనను తెలంగాణ ముఖ్య మంత్రి KCR ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. తెలంగాణా ఉద్యమంలో ఉన్న వారందరినీ ఆదుకున్న కేసీఆర్ తనకు కూడా ఏదైనా చేయాలని కోరింది. ఆరేళ్ళ వయసు నుండే చీరలు కట్టుకుని పాటలు పాడానని, తెలంగాణా రాష్ట్రం వచ్చిన సందర్భంగా అందరూ సంతోషంగా ఉన్నారని, తనే ఏ దిక్కు లేకుండా బాధపడుతున్నానని అంది. తనకు కూడా కేసీఆర్ ఏదో ఒక ఉపాధి మార్గం చూపించాలని కోరింది.
kcr
వాస్తవానికి పెళ్ళి తర్వాత మధుప్రియ కు అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. గతంలో మాటీవీ లో సూపర్ సింగర్స్ కార్యక్రమం ఓ ట్రెండ్ గా సాగుతున్న కాలంలో వీదేశాల నుండి మధుప్రియ తో పాటు ఇతర సింగర్స్ ను పెద్ద పెద్ద కార్యక్రమాలకు పిలిచే వారు మన తెలుగు వారు.  ఇప్పుడు మన తెలుగు వారుంటున్న విదేశాల్లో కూడా పెద్ద కార్యక్రమాలేమీ నిర్వహించకపోవడం…అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. పావాళా శ్యామల విషయంలో పాజిటివ్ గా స్పందించిన కెసిఆర్ మధుప్రియ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

Comments

comments

Share this post

scroll to top