క్రికెట్ కోసం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ప్రపంచకప్ సాధించాడు, కానీ ఇప్పుడు ఉద్యోగం లేక పూటగడవని స్థితిని ఎదుర్కొంటున్నాడు.

The Prime Minister, Shri Narendra Modi meeting the members of the Indian Blind World Cup Winning Team, in New Delhi on December 10, 2014. The Union Minister for Chemicals and Fertilizers, Shri Ananthkumar and the Minister of State for Youth Affairs and Sports (Independent Charge), Shri Sarbananda Sonowal are also seen.

  • చిరు ఉద్యోగి: సార్ 40 రోజులు సెలవు కావాలి?
  • బాస్: ఏరా ఎందుకు… నీవు చేసే పనికి సెలవు కూడానా? అది కూడా 40 రోజులా?
  • చిరు ఉద్యోగి: అవును సార్, నేను ప్రపంచ కప్ ఆడేందుకు ఇండియ ా తరఫున సెలెక్ట్ అయ్యాను.
  • బాస్: అయితే నేనేం చేసేది….వెళ్లి అటలే ఆడుకో…. నీ ప్లేస్ లో వేరే వాడు జాబ్ చేసుకుంటాడు. రిజైన్ చేసి వెళ్లు.
  • చిరు ఉద్యోగి: ( డైలామాలో…..ఉద్యోగం చేస్తే నాకు, మా అమ్మ కు మూడు పూటల తిండి దొరుకుతుంది, అదే క్రికెట్ ఆడి గెలిస్తే దేశానికి పేరు వస్తుంది. నన్ను ఈ దేశం గుర్తిస్తుంది అనుకొని అక్కడిక్కడే రిజైన్ చేసి బట్టలు సర్దుకున్నాడు)

4eb7054d-7e52-48de-a8db-9e8033ba1084

కట్ చేస్తే……అది దక్షిణాఫ్రికా లోని న్యూలాండ్స్ క్రికెట్ స్టేడియం… పాకిస్థాన్,ఇండియాల మధ్య  ప్రపంచ కప్  ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. నిర్ణీత 40 ఓవర్స్ లో పాక్ 389 పరుగులు చేసింది, కష్టతరమైన లక్ష్యంతో బరిలోగి దిగిన ఇండియా జట్టు…టపా,టపా వికెట్లను కోల్పోయింది. టార్గెట్ పెద్దదైపోయింది, బాల్స్ తగ్గుతూ వస్తున్నాయ్. జాతీయ జెండా గుర్తు వచ్చింది.ఇక బ్యాట్స్ మన్ హిట్టింగ్ స్టార్ట్ చేశారు. సిక్స్ లు , ఫోర్ల వర్షం కురిసింది. మరో రెండు బంతులు మిగిలుండగానే  అంత పెద్ద లక్ష్యాన్ని ఊదిపారేశారు మన క్రికెట్ హీరోలు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఆ చిరుద్యోగి కూడా వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో సభ్యుడు… ఆల్ రౌండర్ గా ఇండియా గెలుపులో అతనిది కీలక పాత్ర. ఇతను మన తెలుగబ్బాయ్ కావడం గర్వకారణం.

60da8e38-dd7a-4a61-a69b-2629950761fb

అవును ఇదంతా…..నిజం… ఆ యువకుడి పేరు మధు….అతను ఇండియా అంధుల క్రికెట్ టీమ్ లో ఆల్ రౌండర్…. మధుది పేద కుటుంబం, అమ్మ రోజు కూలీకి వెళుతుంది….అప్పు చేసి మరీ 10 వేలు మధుకు ఇచ్చి దేశం తరఫున ఆడడానికి దీవించి మరీ పంపిది.

అంతా బాగానే ఉంది కానీ……ప్రపంచ కప్ గెలిచాక మాత్రం ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దేశం కోసం ఆట కోసం అన్నం పెట్టే ఉద్యోగాన్ని సైతం కాదనుకున్న మధు ఇప్పుడు కడు దయనీయ జీవితాన్ని గడుపుతున్నాడు. మధు  ఇప్పటికే రెండు ప్రపంచ కప్ లకు భారత్ జట్టు తరఫున ఆడాడు…అయినా అతని  కుటుంబం మాత్రం తీవ్ర కష్టాల్లో ఉంది.చూపు లేకపోయినా దేశ ప్రతిష్ట ను రెపరెపలాడించడం కోసం కష్టాలను లెక్కచేయకుండా పోరాడుతున్న అసలైన వీరుడిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఎవరైనా దాతలు సహకరిస్తే  మంచింది.

Comments

comments

Share this post

scroll to top