“మాధవి లత” కెరీర్ నాశనం ఎందుకైందో తెలుసా?..ఓ ప్రొడ్యూసర్ గురించి చెప్పి ఇంటర్వ్యూ లో ఏడ్చేసింది!

మొదట్లో టీవీ యాంకర్ గా పరిచయమయ్యి…రవిబాబు “నచ్చావులే” సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది…తరవాత “నాని” తో “స్నేహితుడా” లో జత కట్టింది…హీరోయిన్ అందంగా ఉంటుంది..ఆక్టింగ్ కూడా బాగా చేస్తుంది..కానీ ఆమెకి అవకాశాలు రాలేదు…ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా?…”మాధవి లతా”. చిన్న సినిమాల్లో నటించి హిట్ ట్రాక్‌ను సొంతం చేసుకుంది. కానీ సినీ ఇండస్ట్రీని మాత్రం మెప్పించలేకపోయింది. ఆ కారణంగానే ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు. దీంతో మాధవీలత కోలీవుడ్‌కి మకాం మార్చేసింది. అక్కడా సక్సెస్ కాలేదు. కర్ణాటకలో పుట్టి పెరిగిన మాధవీలత మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ కలిగిన నటి అని గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంత టాలెంట్ ఉండి కూడా అయిదారు సినిమాలకే కనిపించకుండా పోయింది.

ఇలా జరగడానికి కారణమేంటి అని ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో అడిగారు…దానికి ఆమె కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కి లొంగకపోవడమే అని సమాధానమిచ్చింది! ఒక ప్రొడ్యూసర్‌ అడిగిన దానికి ఆమె నో చెప్పినందుకు తనను ఎలా వేధించాడో వివరించింది. లొకేషన్‌లో అందరిముందు అరిచేవాడని, ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం షార్ట్ డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని చెప్పింది. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న చాలమంది.. హీరోయిన్స్ విషయంలో మాత్రం సెక్సువల్ రిలేషన్‌కే ప్రాధాన్యత ఇస్తారంది. నేను గనుక నోరు విప్పితే ఎంతమంది కాపురాలు కూలిపోయో అంటూ పరోక్షంగా హెచ్చరించింది. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పరిస్థితి ఇదేనని, సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పుకొచ్చింది. ఇంకా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఎన్నో చేదు విషయాలు, వాటి వెనుక ఉన్న కఠిన వాస్తవాలను మాధవీలత ఆ ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్లు వివరించింది.

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top