“నాతో కాసేపు ఏకాంతంగా గడపవచ్చు కదా. అలా బయటకి వెళ్దామా.?” అంటూ ఆ హీరోయిన్ కి వేధింపులు.!

సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్   ఉంటుందనేది అందరికి తెలిసిని నిజమే..అవకాశాలు రావాలంటే తలొగ్గాల్సిందే..ఎదురుతిరిగినా,కాదన్నా అవకాశాలు లేక అధ:పాతాలానికి తొక్కేస్తారు.సినిమా  గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు దాని బారిన పడ్డామని ఒక్కొక్కరుగా బైటికి చెప్పుకున్నారు.. ఆ మధ్య ఒక నటుడు కూడా లేడీ ప్రోడ్యూసర్లు ,డైరెక్టర్లు నన్ను ఆ విధంగా వాడుకోవడానికి చూసారని తన బాదని చెప్పుకొచ్చాడు.ఇటీవల నచ్చావులే ఫేం మాధవిలతా ఈ అంశంపై మరింత డీటెయిల్డ్ గా చెప్పుకోచ్చారు..ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే..

ఎలా స్టార్ట్ చేస్తారంటే?

“నాకు క్లోజ్ ఫ్రెండ్‌గా ఉండగలవా? మనం ఫన్నీగా ఉందామా?” అంటూ వేధింపులు మొదలవుతాయి. ఇక్కడ స్నేహం అనే పదానికి అర్థమే వేరు. మొదట్లో ఆ ప్రతిపాదన నాకు వెంటనే అర్థం కాలేదు. “నాతో కాసేపు ఏకాంతంగా గడపవచ్చు కదా. అలా బయటకి వెళ్దామా. నీ సినిమా అవకాశాలు గురించి మాట్లాడొచ్చు” అని మేనేజర్లు సందేశాలు పంపిస్తారు. నేరుగా ఎవరూ ఏమీ అనరు. కానీ ప్రతి సందేశం వెనుకా ‘అదే’ అంతరార్థం ఉంటుంది.”ఒక్కటే జీవితం, తేలికగా తీసుకోవచ్చు కదా, తప్పేముంది అవునంటే” అని సలహాలిస్తారు. పార్టీలకు వెళితే రూంకి రావచ్చా, కొంతసేపు దగ్గరగా గడపవచ్చు కదా అని అడుగుతారు. అలా అని ఒత్తిడికి తలొగ్గితే అవకాశాలు వస్తాయని నియమం ఏమీ లేదు.”మేము సినిమా ఇస్తున్నాం, డబ్బులిస్తున్నాం. మాకేమిటి అని ఆలోచిస్తారు చాలా మంది నిర్మాతలు. ఆ అమ్మాయి అంకిత భావంతో పని చేస్తుందా అని అడుగుతారు, కానీ అంకిత భావం వృత్తికి కాదు, వ్యక్తులకి. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎవరూ చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే, చెప్పిన మరుక్షణం అవకాశాలు మాయమవుతాయి”.

కొన్ని మాటలకు అర్దాలే వేరులే..

ఆ అమ్మాయికి పొగరు, మాట వినదు అని ముద్ర వేస్తారు.అస్సలు ‘సహకరించదు’. నాట్ కమిటెడ్ అంటారు. ఈ పదాలకు ఈ పరిశ్రమలో అర్థాలు వేరు.అమ్మాయి ఆత్మాభిమానంతో ఉంటే పొగరు అని ముద్ర వేస్తారు.”నేను ఒక రోజు నా స్నేహితురాలికి పెట్టిన మెసేజ్ చూసిన డైరెక్టర్ ఆ రోజు నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. చెడు ప్రచారం చేశాడు. నేను కాదనడంతో నా కెరీర్ అంతా పోయింది. వచ్చిన అవకాశాలు అన్నీ పోయాయి. నాకున్న సౌకర్యాలు అన్నీ తీసేశారు. తిట్టారు. రోజూ మానసిక వేదన అనుభవించాను. ఒత్తిడి భరించలేక వాళ్ళ ప్రతిపాదనలకు ఒప్పుకుంటామని ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించారు.. ఒక్కసారి స్టార్ స్థాయి సంపాదిస్తే ఇలాంటి వేధింపులనుండి కొంతవరకు తప్పించుకోవచ్చు..అని టాలివుడ్లో  తెరవెనుక జీవితం ఎలా ఉంటుందో ,వర్ధమాన తారలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో కళ్లకు కట్టినట్టు చూపించారు.

Comments

comments

Share this post

scroll to top