“ఒసేయ్ ఆపే నీ సోది..” అని ఫేస్బుక్ లో ఒకరు కామెంట్ చేస్తే..”మాధవి” ఏమని రిప్లై ఇచ్చిందో తెలుసా.?

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన మాధవీలత నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది..తర్వాత స్నేహితుడా సినిమాలో నాని సరసన ఛాన్స్ కొట్టేసి ఆ సినిమాతో మంచి మార్కులే తెచ్చుకుంది.అయినప్పటికి అవకాశాలు రాలేదు.. ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.అడపా దడపా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది..తాజాగా పవన్ గురించి మాధవిలత పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు గా రావడమే చాలా అరుదు. ఉన్న అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో మాధవిలత కుడా ఒకరు.ఒక టెలివిజన్ ఛానెల్లో యాంకర్ గా కెరీర్ మొదటు పెట్టిన మాధవిలత హీరోయిన్ గానూ రానించింది.ప్రస్తుతం మాధవీలత  ఏచిత్రం లోను నటించడం లేదు.సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా మాత్రం అభిమానులకు ఎప్పుడూ చేరువలో ఉంటుంది.తాజాగా పవన్ గురించి ఒక పోస్టు పెట్టింది..ఆ పోస్టు సారాంశం ఏంటంటే….

“నాకు సమాజ సేవ కూడా చాలా ఇష్టం అని … సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో నక్షత్ర ఫౌండేషన్ ని తాను స్థాపించాను. కానీ నిధులు, సపోర్టర్స్ లేక నా కోరిక నెరవేరలేదు. కానీ సమాజ సేవ చేయాలనే తన పట్టుదల ఇంకా చావలేదని ..పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం ఉన్నప్పుడు ఆయన స్థాపించిన జనసేన పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు,ఆ పార్టీ ద్వాారా ఎందుకు సేవ చేయకూడదు అంటూ చెప్పుకొచ్చింది..పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టం ఉన్న విషయాన్ని గత పదేళ్లుగా పలు ఇంటర్వ్యూ లలో వెల్లడిస్తున్నానని మాధవీలత అన్నారు.అయితే పోస్టు చివర్లో  పవన్ కళ్యాణ్ కోసం దేనికైనా రెడీ అంటూ కామెంట్ పెట్టడంతో ఇదే హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతుంది.”


ఇది ఇలా ఉండగా…మాధవి లత చెబుతున్న సమాధానాలకు ‘ఒసేయ్ ఆపే నీ సోది…’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టడంతో మాధవి లత ఫైర్ అయ్యారు. ‘అసలు మీకు కల్చర్ లేదు. మీరు కల్చర్డ్ గా మాట్లాడితే నేను కల్చర్డ్ గా మాట్లాడతాను. మీరు ఎడ్యుకేటెడ్ అయుండి ఒక పబ్లిక్ సైట్లోకి వచ్చి ఒక అమ్మాయిని పట్టుకుని ఒసేయ్, అదీ, ఇదీ అనడం కరెక్ట్ కాదు బ్రదర్…’ అంటూ మండి పడ్డారు.

Comments

comments

Share this post

scroll to top