రండి…ఓ మంచిపని చేద్దాం.! ఆకలితో అలమటిస్తున్న అనాథలకు ఓ పూట భోజనం పెడదాం.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం…అనాథాశ్రమాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నవంబర్ 8 వరకు దాతల సహాయంతో రెండుపూటలా అన్నం తినగలిగిన వారు, ఇప్పుడు ఆకలితో అలమటించిపోతున్నారు.నోట్ల రద్దుతో డొనేషన్ కు దాతలు ముందుకు రాకపోవడంతో ఈ సమస్య మరీ ఎక్కువైంది, ఉన్న సరుకులతో ఇప్పటి వరకు నెట్టుకొచ్చిన అనాథాశ్రమాలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయి.అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే…. అనాథాశ్రమాల్లో ఉండే చిన్న చిన్న పిల్లలు సైతం అర్థాకలితో రోజులు వెళ్లదీస్తున్నారు.

రండి…ఓ మంచి పని చేద్దాం…. అవినీతి భరతం పడుతూనే… ఆకలిని తీర్చే పనిని కూడా చేపడదాం. ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు ఓ పూట భోజనం పెడదాం. దీని కోసం బ్యాంక్ లకు వెళ్లి డబ్బులు డ్రా చేయాల్సిన అవసరం లేదు, ATM ల ముందు గంటలకు గంటలు లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి….మీరు ఏ వస్తువైతే అనాథాశ్రమానికి డొనేట్ చేయాలనుకుంటున్నారో…….ఆ వస్తువు మీద క్లిక్ చేసి…ఆ మేరకు బిల్ ను మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే చాలు. మీరు కొన్న వస్తువులను ఆ సంస్థ వారు…మీ పేరు మీదుగా సదరు అనాథాశ్రమానికి పంపిస్తారు. ఈ ఆపద సమయంలో…మనవంతుగా అనాథపిల్లలకు ఆసరాగా ఉందాం.

అనాథపిల్లల ఆకలితీర్చడానికి   Click :   HERE.

మా ఇళ్లు అశ్రమం గురించి క్ష్లుప్తంగా: మార్చ్ 25, 2006 లో స్థాపించబడిన ఈ ఆశ్రమంలో..అనాథపిల్లలను చేరదీసి, వారికి వసతి,భోజన సదుపాయాలు కల్పించి, ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పించి చదువును చెప్పిస్తున్నారు. అనాథపిల్లల అభివృద్దే ధ్యేయంగా నడుస్తున్న ఈ ఆశ్రమానికి..ఎన్నో అవార్డ్ లు లభించాయి. సామాజిక వేత్త గాదె ఇన్నారెడ్డి తన జీవితాన్ని ఈ ఆశ్రమానికి, అనాథపిల్లల అభివృద్ది అంకితమివ్వడం గొప్పవిషయం.

అనాథపిల్లల ఆకలితీర్చడానికి   Click :   HERE.

maaillu3

డైరెక్ట్ డొనేషన్స్ కొరకు సంప్రదించాల్సిన చిరునామ.:

Maaillu, Prajaadharana Pranganam,
Post & Mandal: Zaffargadh, Dist: Warangal, pincode: 506316.,A.P., INDIA.
Cell no. Gade Inna Reddy 09866216680, 09494842893, 09989185709
prajaaadharana@maaillu.org

Comments

comments

Share this post

scroll to top