క‌వీ మెహ‌బూబ్..క‌ళార‌వీ బ‌హుత్ ఖూబ్

కవుల‌కు ..క‌ళాకారుల‌కు ..ప్ర‌తిభావంతుల‌కు పుట్టినిల్లు సినిమారంగం. అదో అంతులేని మాయాలోకం. అదో క‌ల‌ల ప్ర‌పంచం. క‌న్నీళ్లు దోసిళ్ల‌లోకి వంపుకోవ‌చ్చు..సంతోషం ఎలా వుంటుందో..చూడొచ్చు. నీకు రాజ్యం వుండి ఉండొచ్చు గాక‌..నీకు మందీ మార్బ‌లం ..లెక్క‌లేనంత సైన్యం..అధికార‌గ‌ణం..ఆహా ఓహో అంటూ వంత పాడే జ‌నం..జేజేలు ప‌లికే నువ్వు పోషించే కిరాయి మ‌నుషులు వుండొచ్చు గాక‌..ఇవేవీ ఇవ్వ‌ని ఆనందం నాకు ఒక్క క‌విత్వంతో క‌ర‌చాల‌నం చేస్తే వ‌స్తుంది. ఇదీ క‌విత్వానికి వున్న శ‌క్తి. రాజ్యాలు గ‌జ గ‌జ లాడాయి. సామ్రాజ్యాలు కూలి పోయాయి. ఎంద‌రో నేల‌మ‌ట్ట‌మ‌య్యారు.  కానీ క‌లాలు ఇంకా మొన‌తేలి ఉన్నాయి. ప్ర‌జల ప‌క్షాన నిల‌బ‌డ్డాయి. జ‌నం గొంతుకు ప్ర‌తిరూపంగా నిలుస్తున్నాయి. పోరాటాల‌కు..ఆరాటాల‌కు ఊపిరిలూది..క‌విత్వం కొత్త పుంత‌లు తొక్కుతోంది. క‌వులు ప్ర‌పంచ‌మంత‌టా అద్భుతంగా క‌విత‌లు అల్లుతూ..పాట‌లు రాస్తూ త‌మ‌ను తాము ఆవిష్క‌రిస్తున్నారు. ప్ర‌జా గొంతును వినిపిస్తున్నారు.

mehaboob lyricst

భార‌తీయ సినిమా ఎంత గొప్ప‌దంటే ప్ర‌పంచం నివ్వెర పోయేలా అద్భుత‌మైన క‌విత్వీక‌ర‌ణ‌తో పాట‌లు అల్లుతున్నారు మ‌న గేయ ర‌చ‌యిత‌లు. తెలుగులో తేజ‌, చంద్ర‌బోస్‌, సిరివెన్నెల‌, జొన్న‌విత్తుల‌, అనంత్ శ్రీ‌రాం, పెద్దాడ మూర్తి, శ్రీ‌మ‌ణి, పెంచ‌ల దాసు, గోరేటి వెంక‌న్న‌..ఇలా ఎంద‌రో పండిస్తున్నారు. త‌మిళంలో వైర ముత్తు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం..ఇలా ప్ర‌తి భాష‌లో కొత్త త‌రం గేయ క‌వులుగా పేరు తెచ్చుకుంటున్నారు. ప్ర‌తిభ క‌లిగి ఉన్న వారిని గుర్తించి..ప్రోత్స‌హించ‌డంలో ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ..రెహ‌మాన్‌. అల్లా ర‌ఖాకు సూఫీ అంటే ఇష్టం. ప్ర‌తి సినిమాలో ఏదో ఒక సాంగ్ అంత‌ర్లీనంగా సూఫీ ఉండి ఉంటుంది. ఇది ఆయ‌న ప్ర‌త్యేక‌త‌.రెహ‌మాన్ పుణ్య‌మా అంటూ మ‌న‌కంటూ ఓ మంచి క‌వి దొరికాడు. చెలికాడై పాట‌ల్ని చ‌ల్లుకుంటూ పోతున్నాడు. హిందీ సినీ రంగంలో ఒక్కసారిగా త‌న పాట‌ల‌తో మెస్మ‌రైజ్ చేశాడు..మెహ‌బూబ్ ఆలం కొత్వాల్‌. ముంబైలో పుట్టాడు. 1986లో మెహ‌బూబ్ ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇస్మాయిల్ ద‌ర్బార్‌ను క‌లిశాడు. పాట‌లు రాస్తాన‌ని చెప్పాడు. క‌విత్వం వేరు..సినిమాల‌కు పాట‌లు రాయ‌డం వేరు. స్పాంటేనియ‌స్‌కు ఎక్కువ ఛాన్స్‌. ప‌ల్ల‌వులు..చ‌ర‌ణాలు క‌ల‌వాలి. సిట్యూయేష‌న్‌కు త‌గ్గ‌ట్టు రాసే అల‌వాటు చేసుకోవాలి. క‌విత్వం ఈజీ..కానీ పాట‌లు క‌ట్ట‌డం చాలా క‌ష్టం అని చెప్పాడు. ఇస్మాయిల్ మెహ‌బూబ్‌ను ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రాం గోపాల్ వ‌ర్మ‌కు ఇంట్ర‌డ్యూస్ చేశాడు.

మెహ‌బూబ్ కు 1992లో ద్రోహి సినిమాకు పాట రాసే అవ‌కాశం ఇచ్చాడు. రాహుల్ దేవ్ బ‌ర్మ‌న్ దీనికి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. రంగీలా సినిమాకు రాయించాడు. అత‌ని ప్ర‌తిభ‌ను గుర్తించిన వ‌ర్మ‌..మ‌ణిర‌త్నంకు ప‌రిచ‌యం చేశాడు. త‌మిళ‌, తెలుగులో సంచ‌లనం సృష్టించిన బొంబాయి సినిమా హిందీ వ‌ర్షెన్‌లో మెహ‌బూబ్ పాట‌లు రాశాడు. రెహ‌మాన్‌తో జ‌త‌క‌ట్టాడు. త‌క్ష‌క్‌, డోలీ స‌జాకే ర‌ఖ్‌నా, దిల్ హి దిల్ మై, మా తుజే స‌లాం , యువ‌కు కూడా మెహ‌బూబ్ రాసి మెప్పించాడు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హ‌మ్ దిల్ దే చుప్కే స‌నం ..కేకే ఆల్బం ..ప‌ల్‌, హ‌మ్ స‌ఫ‌ర్‌కు రాశాడు. 2002లో క‌మాల్ ఖాన్ హిందీలో పాడిన పాప్ ఆల్బం క‌ల్ రాత్ కు రాసి ఔరా అనేలా చేశాడు.ప్ర‌తి సినిమా సెల్యూలాయిడ్‌పై గుర్తుంచు కోవాల్సిన పాట‌ల్ని రాశాడు మెహ‌బూబ్‌. ద్రోహితో మొద‌లైన ప్ర‌స్థానం రంగీలా, బొంబాయి, యాష్‌, రిట‌ర్న్ ఆఫ్ జోయెల్ తీఫ్‌, దౌడ్‌, ఇన‌వార్‌, వందే మాత‌రం, డోలీ స‌జాకే ర‌ఖ్‌నా, తక్ష‌క్‌, రాక్ ఫోర్డ్‌, హ‌మ్ దిల్ దే చుకే స‌నం, దిల్ హీ దిల్ మైహూ, కౌఫ్‌, ఒన్ టూ కా ఫోర్‌, యే రాస్తా హై ప్యార్ కే, గ్రాహ‌న్‌, బ‌స్ ఇత్నా సా క్వాబ్ హై, దేష్ దేవి, శ‌క్తి ద ప‌వ‌ర్‌, బాజ్ – ఏ బ‌ర్డ్ ఇన్ డేంజ‌ర్‌, తుజే మేరీ క‌స‌మ్‌, కోల్‌క‌త్తా మెయిల్‌, ల‌కీర్‌- ఫ‌ర్‌బిడ‌న్ లైన్స్‌, ఉఫ్‌..క్యా జాదూ మొహ‌బ్బ‌త్ హై, యువ‌, అన్నియాన్‌, దిల్నే జిసే అప్నా క‌హా, హాలీడే, ఇక్రార్ బై ఛాన్స్‌, హ‌ల్లా బోల్‌, ఏక్ ఛాలిస్ కి లాస్ట్ లోక‌ల్‌, అప్నా ఆస్మాన్‌, కాంట్రాక్ట్‌, త‌హా, సిర్ఫ్‌, ల‌మ్‌హా, ముస్క్‌రాఖే దేఖ్ జ‌రా, ఇత్రా సినిమాల‌కు పాట‌లు రాసి మెప్పించాడు. గుండెల్ని క‌దిలించాడు మెహ‌బూబా.

ఆయ‌న రాసిన వాటిలో పాపుల‌ర్ అయిన‌వి..నేటికీ పాడుకోత‌గ్గ వాటిలో ..తూ హీ రే..హ‌మ్మా హ‌మ్మా..కెహ్నా హి క్యా, కుచి కుచి ర‌క్క‌మ్మా , యారోనా జానే ముజేహి క్యా హో గ‌యా, సుభా సుభా జ‌బ్ ఖిడ్కీ ఖోలే, ఓ భ‌వ్‌రే, ఆయే నాజ్‌నీన్ సునో నా, డోలా డోలా, త‌ర్ ప‌మ్ త‌ర్ ప‌మ్‌, కిస్సా హ‌మ్ లిఖేంగే, చాంద్ చుపా, నింబుడ నింబుడ , త‌డ‌ప్ త‌డ‌ప్ , దోలీ తారో దోలీ బాజే, ఆంఖో కీ గుస్సా కియా, జోంఖా హ‌వా క్యా, త‌న్హా త‌న్హా, ప్యార్ యెహ్ జానే కైసా, రంగ్ దే, కామోష్ రాత్‌, మా తుజే స‌లాం, ఖుదా ఆఫిజ్‌, ఫ‌న్నా ఫ‌న్నా, ద‌క్కా ల‌గ్గా భుక్కా లాంటి పాపుల‌ర్ పాట‌లంటికి ప్రాణం పోసింది..మెహ‌బూబే. రంగీలాకు పాట‌ల‌కు రాసినందుకు జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నాడు.మ‌న‌సు బావోలేన‌ప్పుడు మెహ‌బూబ్ రాసిన పాట‌ల‌ను వింటే చాలు..హృద‌యాలు తేలిక‌వుతాయి. మ‌న‌సులు గ‌ట్టి ప‌డ‌తాయి. గుండెల్లో ప్రేమ మ‌ళ్లీ మొల‌కెత్తుతుంది.

Comments

comments

Share this post

scroll to top