ఈ చ‌లికాలంలో…ఒక్క‌రోగం కూడా మీ ధ‌రి చేర‌కూడ‌దంటే…ఈ 5 ప‌నులు చేయండి.!

వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. ఎక్క‌డ చూసినా ఇప్పుడు వ‌ర్షాలు ప‌డుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో మ‌న‌పై ఎప్పుడు దాడి చేద్దామా అన్న‌ట్టు సూక్ష్మజీవులు, క్రిములు వేచి ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వ‌ద్దామా అన్న‌ట్టుగా అనారోగ్యాలు పొంచి ఉన్నాయి. వ‌ర్షాకాలం అంటేనే ఎన్నో ర‌కాల వ్యాధులు సుల‌భంగా ప్ర‌బ‌లేందుకు అనువుగా ఉండే కాలం. స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే మ‌నం అనారోగ్యాల బారిన ప‌డ‌డం ఖాయం. అయితే వీటిని ఎదుర్కోవాలంటే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తే చాలు. ఎలాంటి అనారోగ్యాలు మ‌న ద‌రికి చేర‌వు. మ‌రి ఆ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ఎలా ప‌టిష్టం చేయాలో మీకు తెలుసా? తెలీదా..? అయితే అదెలాగో చూద్దాం ప‌దండి.

veggies

మ‌న శ‌రీరంలో లింఫ్ వ్యవ‌స్థ అని ఒక‌టుంటుంది. అదేం చేస్తుందంటే శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతోపాటు బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. చివ‌రిగా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఈ క్ర‌మంలో లింఫ్ వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేసేలా చూస్తే చాలు. మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి త‌ద్వారా మ‌న‌కు ఎలాంటి అనారోగ్యాలు క‌ల‌గ‌కుండా ఉంటాయి. మరి లింఫ్ వ్య‌వ‌స్థ‌ను స‌రిగ్గా ప‌నిచేసేలా చేయాలంటే ఏం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దామా!

  • పాల‌కూర‌, తోట కూర వంటి ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను నిత్యం తింటుంటే లింఫ్ వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌నిచేస్తుంది.
  • ఈ కాలంలో ప్ర‌తి ఒక్క‌రు నిత్యం 2 నుంచి 4 లీట‌ర్ల నీటిని క‌చ్చితంగా తాగాలి. దీని వ‌ల్ల లింఫ్ గ్రంథులు తమ ప‌నిని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తాయి.
  • లింఫ్ గ్రంథులు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే అల‌స‌ట‌, ఒళ్ల నొప్పులు, అజీర్ణం, గ్యాస్, స్థూల‌కాయం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వీటిని రాకుండా చూడాలంటే పైనాపిల్, స్ట్రాబెర్రీల‌తో త‌యారు చేసిన మిశ్ర‌మాన్ని నిత్యం తీసుకోవాలి. దీని వ‌ల్ల లింఫ్ గ్రంథులు త‌మ ప‌ని స‌రిగ్గా చేస్తాయి. శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాలు కూడా బ‌య‌ట‌కి పోతాయి.
  • 1/3 క‌ప్పు ఎప్సం ల‌వ‌ణం, 1/2 క‌ప్పు స‌ముద్ర‌పు ఉప్పు, 2 టీస్పూన్ల అల్లం, 1 టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సంల‌ను తీసుకుని బాగా క‌ల‌పాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని బాత్ ట‌బ్‌లోని నీటిలో వేసి దాన్ని 20 నుంచి 30 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. పిద‌ప ఆ ట‌బ్‌లో స్నానం చేయాలి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి పోయి లింఫ్ గ్రంథులు ఉత్తేజ‌మ‌వుతాయి.
  • నిత్యం కొంత స‌మ‌యం పాటు వ్యాయామం చేసినా లింఫ్ గ్రంథులు స‌క్ర‌మంగానే ప‌నిచేస్తాయి.

లింఫ్ వ్య‌వ‌స్థ ఎలా ఉంటుందో చూపే చిత్రాన్ని కింద వీక్షించ‌వ‌చ్చు…

lymph-glands

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top