ఇండియ‌న్ ఐడల్ టైటిల్ విన్న‌ర్ రేవంత్. చేతి ఖ‌ర్చుల‌కు క్యాట‌రింగ్ ప‌నులు చేసిన గ‌తం అత‌నిది.!

తెలుగు తేజం రేవంత్ ఇండియ‌న్ ఐడ‌ల్-9 టైటిల్ ను గెలుచుకున్నాడు. ఆదివారం జ‌రిగిన గ్రాండ్ ఫినాలే లో స‌చిన్ టెండూల్క‌ర్ చేతుల మీద‌గా ఇండియ‌న్ ఐడ‌ల్ టైటిట్ ను అందుకున్నాడు. ఈ గెలుపుతో 25 ల‌క్ష‌ల క్యాష్ ప్రైజ్ +యూనివర్సల్‌ మ్యూజిక్‌ కంపెనీతో ఒప్పందం+ మ‌హీంద్ర కార్ ను సొంతం చేసుకున్నాడు రేవంత్.

ఫైన‌ల్ లో రేవంత్ పాడిన పాట‌లు:

  • చక్‌దే సినిమా నుంచి ‘మర్‌ జాయోన్‌ యా జీ లూన్‌ జరా’ పాట పాడి జవాన్ల కు అంకితమిచ్చాడు.
  • లడ్కీ కా గయీ చుల్‌’ పాట పాడుతూ అమ్మాయిలతో డ్యాన్స్‌ చేస్తూ స్టేజ్ ను ఊపేశాడు.

ఇండియ‌న్ ఐడ‌ల్ లో రేవంత్ ప్ర‌యాణం:
ఓ సాదార‌ణ తెలుగు ప్లే బ్యాక్ సింగ‌ర్ గా స్టార్ట్ అయిన రేవంత్ ప్ర‌యాణం ఇండియ‌న్ ఐడ‌ల్ ఫైన‌ల్ కు వ‌చ్చేస‌రికి దేశ‌వ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ను వెంట తెచ్చుకున్నాడు. హిందీ రాద‌న్న విమ‌ర్శ నుండి టైటిల్ విన్న‌ర్ గా మారాడు. త‌న‌దైన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ తో పాటు త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన వాయిస్ తో ప్ర‌తి పాట‌ను ఎంతో అందంగా ప్రెజెంట్ చేశాడు. వ‌చ్చిన ప్ర‌తి హీరోయిన్ ను ఆట‌ప‌ట్టిస్తూ  ఫ‌న్ జెన‌రేట్ చేశాడు. ఇక అనూమాలిక్, సోనూ నిగ‌మ్ లైతే రేవంత్ కు పెద్ద ఫ్యాన్స్ అయ్యారు.

క్యాట‌రింగ్ చేసి, రేవంత్ ఇండియ‌న్ ఐడ‌ల్ గా ఎదిగిన క్ర‌మం:
శ్రీకాకుళం జిల్లాలోని ఓ మ‌ద్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన రేవంత్….సినీ కెరీర్ లో ఒక్క అవ‌కాశం కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు.
కేట‌రింగ్ చేస్తూ త‌న ఖ‌ర్చులు వెల్ల‌దీసుకునేవాడు. అక్క‌డ‌క్క‌డ జ‌రిగే ప్రోగ్రామ్స్ లో పాట‌లు పాడి…వ‌చ్చిన ఆ డ‌బ్బును ఎంతో జాగ్ర‌త్త‌గా దాచుకునేవాడు. సూప‌ర్ సింగర్ లో అవ‌కాశం రావ‌డం, కీర‌వాణి ప‌రిచ‌యం రేవంత్ లైఫ్ నే ట‌ర్న్ చేసింది.

గెలుపు త‌ర్వాత ఏమ‌న్నాడంటే….?:

ఈ విజ‌యాన్ని స్నేహితులు, కుటుంబ‌స‌భ్యుల‌తో సెలెబ్రేట్ చేసుకొని….ఇక్క‌డ వ‌చ్చి బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డతా..ఇంత‌టి గొప్ప విజ‌యానికి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్.

 

బాహుబ‌లి లో రేవంత్ పాడిన పాట “మ‌నోహ‌రి”:

Revant Best performance:

Comments

comments

Share this post

scroll to top