రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేస్తున్నారా..? అయితే ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోండి..! లేదంటే?

ఒక‌ప్పుడంటే మ‌న పెద్ద‌లు రాత్రి 7 గంట‌ల‌లోపే భోజ‌నం చేసే వారు. దాంతో తిన్న ఆహారం కూడా చ‌క్క‌గా జీర్ణ‌మ‌య్యేది. వారు ఎలాంటి అనారోగ్యాల‌కు గురి కాకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదుగా. మ‌న లైఫ్ట్ స్టైల్ మారిపోయింది. ప‌ని ఒత్తిడి, పార్టీలు, టీవీ.. ఇత‌ర వ్యాపకాల‌తో మ‌నం రాత్రి పూట 10 గంట‌లు అయితే గానీ భోజనం చేయ‌డం లేదు. దీంతో నేటి త‌రుణంలో అనేక మందికి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే నిజానికి రాత్రి 10 గంట‌లు దాటితే అస్సలు భోజ‌నం చేయ‌రాదు తెలుసా..? అలా భోజ‌నం చేస్తే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాత్రి 10 గంట‌లు దాటాక భోజ‌నం చేస్తే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వ్వ‌దు. దీంతో గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వచ్చేస్తాయి. ఫ‌లితంగా విరేచ‌నం సాఫీగా అవ‌దు. దీంతో శ‌రీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి. అవి వ్యాధుల‌ను, ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌ల‌గ‌జేస్తాయి.

2. రాత్రి 10 దాటాక భోజ‌నం చేస్తే అప్పుడు ఆహారం ద్వారా మ‌న‌కు ల‌భించే శక్తి అంతా ఖ‌ర్చు కాదు. దీంతో అది కొవ్వు రూపంలో స్టోర్ అవుతుంది. అది గుండె జ‌బ్బుల‌ను తెచ్చి పెడుతుంది. అధికంగా బ‌రువు పెరిగేలా చేస్తుంది.

3. ఆల‌స్యంగా తింటే శ‌రీరం ఆ ఆహారాన్ని జీర్ణం చేసేందుకే స‌మ‌యం వెచ్చిస్తుంది. దీంతో ఒంట్లో ఉన్న మర‌మ్మ‌త్తుల‌ను శ‌రీరం చేయ‌లేదు. ఫ‌లితంగా వ్యాధులు త‌గ్గ‌వు.

4. ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. తిన్న ఆహారం క‌డుపులో జీర్ణం కాకుండా అలాగే ఉంటుంది. దీంతో బాక్టీరియా, వైర‌స్‌లు శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను దెబ్బ తీస్తాయి.

5. రాత్రి 10 గంట‌లు దాటాక భోజనం చేయ‌డం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ్యాధి బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతోపాటు శ‌రీర జీవ‌క్రియ‌ల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది. క‌నుక అధికంగా బ‌రువు కూడా పెరుగుతారు.

6. లేట్‌గా తిన‌డం వ‌ల్ల క‌లిగే మ‌రో అనారోగ్య స‌మ‌స్య నిద్ర‌లేమి. మ‌నం తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు క‌నీసం 4 నుంచి 6 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. అలాంట‌ప్పుడు రాత్రి పూట ఆల‌స్యంగా తింటే నిద్రకు భంగం క‌లుగుతుంది. ప‌లితంగా నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తుంది.

పైన చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌లు రాత్రి పూట ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం వల్ల క‌లుగుతాయి. క‌నుక రాత్రి ఎంత వీలైతే అంత త్వ‌ర‌గా భోజ‌నం చేయడం మంచిది. భోజ‌నం చేశాక 30 నిమిషాల త‌రువాత 15 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. దీంతో బ్ల‌డ్ షుగ‌ర్ లెవల్స్ త‌గ్గుతాయి. ఇక తిన్న త‌రువాత 2 గంట‌లు దాటాకే నిద్రించాలి. లేదంటే అధిక బ‌రువు పెరుగుతారు. జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Comments

comments

Share this post

scroll to top