లాఫింగ్ బుద్దా ప్లేస్ లో లక్కీ క్యాట్స్… ట్రెండ్ మార్చిన జపానీస్!

ఎక్కడికో పనిమీద ఫాస్ట్ ఫాస్ట్ గా బయలుదేరారు. బయలుదేరి బయటకు రాగానే ఒక పిల్లి ఎదురొచ్చింది. ఇక ఈ పనీ జరిగినట్లేనని చిరాకుగా, శక్తిని కోల్పోయి కొద్దిసేపు కూర్చొని, మంచినీళ్ళు తాగేసి మళ్ళీ పయనమవుతారు. అదే నల్లపిల్లి ఎదురైతే కీడు జరుగుతుందని చాలా మంది భావిస్తారు. ఇక చాలామందైతే పిల్లులను దగ్గరికి చేర్చుకోరు , ఇంట్లో కూడా పెంపుడు జంతువులుగా పెంచుకోవడానికి ఇష్టపడరు. కేవలం మనదేశంలో మాత్రమే కాదు, చాలా మంది ఇలానే భావిస్తారు. కానీ ఆ దేశంలో మాత్రం పిల్లిని అదృష్టంగా భావిస్తారు. మనం ఫాలో అవుతున్న మూడనమ్మకాలను వాళ్ళు అస్సలు పట్టించుకోరు. వారే జపాన్ దేశస్థులు. టెక్నాలజీ పరంగా దూసుకువెళ్తున్న వీరు, ఒకొప్పుడు తమ పాపాలు తొలగిపోవడానికి, ఎలాంటి కీడు జరగకుండా లాఫింగ్ బుద్ధాలను తమ ఇంట్లో, కార్యాలయాలలో ఉంచుకునేవారు.

Black-Cat-fact-2

తాజాగా వాటిని భర్తీ చేస్తూ ‘లక్కీ క్యాట్స్'(అదృష్ట పిల్లులు)ను ఉంచారు. ఈ లక్కీ క్యాట్స్ ను తమకెదురుగా ఇంట్లో, ఆఫీస్ లలో ఉంచుకోవడం వలన వ్యతిరేక శక్తులు దరిచేరవని, ఎటువంటి కష్టనష్టాలు తమకు కలగవని, ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు వాటిని చూస్తూ వెళితే, తమకంతా అదృష్టం కలుగుతుందని జపాన్ దేశస్థులు నమ్ముతున్నారు. ప్రస్తుతం అక్కడ ‘లక్కీ క్యాట్స్’ సేల్ విపరీతంగా ఉందట. లాఫింగ్ బుద్ధ బొమ్మలను పక్కనపెట్టి మరీ లక్కీ క్యాట్స్ ను ఉపయోగిస్తున్నారంటే వాళ్ళు ఎంతలా నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు.

Comments

comments

Share this post

scroll to top