ప్రేమజంట శృంగార వీడియో లీక్ , గ్రామ బహిష్కరణ శిక్ష వేసిన పెద్దలు.

వాళ్లిద్దరూ లవర్స్… కాకపోతే కాస్త అడ్వాన్స్ అయ్యారు. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అనుకొని శారీరకంగా ఒకటయ్యారు. పది రోజుల తర్వాత వాళ్లిద్దరి శృంగార వీడియో  సిడి ఊరందరి  చేతుల్లో ప్రత్యక్షమైంది. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు వారిద్దరిని ఊరి నుండి బహిష్కరించారు. ఈ ఘటన ఆగ్రాకు సమీపంలోని నాయకీ మండీ అనే గ్రామంలో జరిగింది.  లవర్స్ చేసింది తప్పే, కానీ ఈ వీడియో బయటికి రావడానికి అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

గ్రామబహిష్కరణ కు గురైన లవర్స్ లో అమ్మాయికి ఓ చెల్లి ఉంది. ఆమెను లవ్ చేస్తున్నానంటూ గతంలో  ఓ పోకిరి వెంటపడ్డాడు, మ్యాటర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీస్ వాళ్లు ఆ పోకిరికి నాలుగు తగిలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇక అప్పటి నుండి ఆ ఫ్యామిటీ మీద కోపాన్ని పెంచుకున్నాడు ఆ పోకిరి.

అప్పటి నుండి అవకాశం కోసం ఎదురు చూసిన ఆ పోకిరికి, తను లవ్ చేసిన అమ్మాయి సోదరి తన బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లడం చూసి ఫాలో అయ్యాడు, వారు శారీరకంగా ఒకటవ్వడాన్ని వీడియో తీశాడు.పక్కనే ఉన్న ఆగ్రాలోని ఓ సిడిల షాప్ కు వెళ్లి   ఈ వీడియోను అనేక CD లా చేసి, వాటిని గ్రామస్థులకు అందేలా చేశాడు.

ఇది ఆగ్రాలో జరిగిన రియల్ స్టోరి… లవ్ తప్పుకాదు, లవ్ పేరుతే చేసే ఇటువంటి పనులే తప్పు.. ఒకడు ప్రేమ నిరాకరించిందని కక్ష కట్టడం, ఇంకొకరు ప్రేమలో ఉన్నామని బరి తెగించడం. దీని మూలంగానే ఇద్దరి జీవితాలు, రెండు కుటుంబాల పరువు , మర్యాదలు …రోడ్డున పడ్డాయ్. ఓ సారి ఆలోచించండి.

CLICK: ఈ పాట విన్నారా? అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top