క్లైమాక్స్ మార్చుకున్న లవర్స్ డే… చేంజ్ ఏమిటో తెలుసా.??

కన్నుగీటు పాప ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించిన లవర్స్ డే చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈ చిత్రం మంచి హైప్ మధ్యలోనే విడుదల అయ్యింది, కానీ సినిమా ఆశించిన స్థాయిలో జనాలను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ దెగ్గర బోల్తా పడింది.

జాగ్రత్త పడినా…:

ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ జనాలకు అస్సలు రుచించలేదు, తీవ్ర విమర్శలు రావడం తో సినిమా క్లైమాక్స్ ని చేంజ్ చేసి రెండవ వారం నుండి చేంజ్ చేసిన క్లైమాక్స్ తో నడిపిస్తున్నారు, అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరగడం తో జనాల్లో క్లైమాక్స్ చేంజ్ చేసిన ఇంటరెస్ట్ రాలేదు, యూత్ కి అంతో ఇంతో ఈ చిత్రం కనెక్ట్ అవ్వడం తో ఒక మాదిరి కలెక్షన్స్ ని అయినా రాబట్టగలిగింది.

ప్రియా కాదు నూరిన్.. :

లవర్స్ డే సినిమా ద్వారా ప్రియా ప్రకాష్ వారియర్ కు ఒరిగిందేమి లేదు, సోషల్ మీడియా హైప్ వల్ల సినిమా విడుదలకు ముందే స్టార్ అయిపోయింది, కానీ సినిమా విడుదల తరువాత అమ్మడు పేరు ఎవ్వరు ఎత్తట్లేదు, కారణం నూరిన్ షెరీఫ్. లవర్స్ డే సినిమా లో నూరిన్ షెరీఫ్ కు అందరూ ఫ్యాన్ అయిపోయారు. నూరిన్ షెరీఫ్ నటన, అందం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది, లవర్స్ డే సినిమా విడుదల తరువాత నూరిన్ షెరీఫ్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగింది. లవర్స్ డే దర్శకుడు మాత్రం విమర్శలను ఎదురుకున్నాడు, భారీ హైప్ నడుమ తెలుగు, తమిళ్, మలయాళం బాషలలో విడుదలైన ఈ చిత్రం, ఏ ఒక్క ఏరియా లోను కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది, అంచనాలను అందుకొని ఉంటే కచ్చితంగా భారీ విజయాన్ని సాధించి ఉండేది లవర్స్ డే.

టాటూ అర్ధం.. :

ప్రియా ప్రకాష్ వారియర్ తన యదపై అర్థం కాని టాటుతో యూత్ కి పిచ్చెక్కిస్తోంది. దీంతో తన టాటుతో ప్రియా ప్రకాష్ వారియర్ మరోసారి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆ టాటూ అర్ధం ఏంటో ప్రియా ప్రకాష్ ఇంకా రెవీల్ చెయ్యలేదు..

శ్రీ దేవి గారి పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్.?

ప్రియా ప్రకాష్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘శ్రీ దేవి బంగళా’, చిత్ర ట్రైలర్ ని ఇటీవలే యూట్యూబ్ లో విడుదల చేసారు. ఈ చిత్ర ట్రైలర్ ని చూసిన జనాలందరూ ఈ చిత్రానికి శ్రీ దేవి గారి పేరు పెట్టడమే కాదు, శ్రీ దేవి గారి నిజ జీవితాన్నే చూపించారు అని చెప్పుకోడం మొదలెట్టారు, అందుకు కారణం లేకపోలేదు, ట్రైలర్ లో చూపించిన సీన్స్ కూడా బయోపిక్ అనడానికి అనుకూలంగానే ఉన్నాయ్. అయితే ఈ వార్తలను ప్రియా ప్రకాష్ వారియర్ కొట్టేసింది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top