ప్రియా ప్రకాష్ మలయాళం సినిమా ని లవర్స్ డే గా మన ముందుకు తెస్తున్నారు. సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ మొదలెట్టిన తెలుగు బడా పేజెస్..!!

కన్నుగీటు భామ అంటే అందరికి గుర్తు వచ్చేది ప్రియా ప్రకాష్ వారియర్ ఏ, కేవలం ఒక్క వీడియో తో ఇంటర్నెట్ ని ఒక ఊపు ఊపింది, ఇండియా వైడ్ రాత్రికి రాత్రి సెన్సేషన్ సృష్టించింది ఈ భామ. అఖిల్ అక్కినేని తో కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ లో నటించింది ఇటీవలే. ఓరు అడార్ లవ్ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు, కేవలం వీడియో సాంగ్స్ మరియు టీజర్ తోనే సంచలనం సృష్టించింది ఈ భామ.

ఓరు అడార్ లవ్ రిలీజ్ కాకపోడానికి గల కారణాలు :

2018 లోనే ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదాలు పడుతూ ఉంది, ప్రియా ప్రకాష్ వారియర్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడం తో, సినిమా లో ఆమె పాత్రను పెంచారని సమాచారం, అందుకే ఈ సినిమా వాయిదా పడిందని సమాచారం. ఈ చిత్రాన్ని మలయాళం తో పాటు ఇతర భాషల్లో కూడా ఫిబ్రవరి 14 న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

లవర్స్ డే బదులు లవ్ డే అని పెట్టి ఉంటే.. :

తెలుగు లో ‘లవర్స్ డే’ గా ‘ఓరు అడార్ లవ్’ చిత్రాన్ని అనువదించనున్నారు, లవర్స్ డే టైటిల్ ను సోషల్ మీడియా లో నెటిజన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా లో తెలుగు బడా పేజెస్ అయితే ఆడుకుంటున్నాయి. లవర్స్ డే బదులు లవ్ డే (ప్రేమ రోజు) అని పెట్టి ఉంటే కరెక్ట్ గా సెట్ అయ్యేది అని పోస్ట్స్ వేస్తున్నారు. కానీ లవ్ డే అంటే ప్రేమ రోజు కాదని మన అందరికి తెలుసు..

 

Comments

comments

Share this post

scroll to top