ఇది ఓ ప్రేమికులురాలి బాధ…ఆమె మాటల్లోనే.

నిజ‌మైన‌ ప్రేమ క‌థ‌ల్లో విషాదాంతాలే ఎక్కువ‌. నాప్రేమ కూడా ఆ కోవ లోనిదే. నా ల‌వ్ స్టోరీనే ఇప్పుడు మీతో పంచుకోవాల‌నుకుంటున్న‌. నా పేరు సంధ్య‌, అత‌ను మ‌నోజ్….నా ఇంట‌ర్ క్లాస్ మేట్…ఎట్రాక్ష‌నా? ల‌వ్వా? అని తెలుసుకునే లోపే మేమిద్దం ఘాఢ ప్రేమ‌లో మునిగిపోయామ్…. డిగ్రీ 3 ఏళ్లు, ఆత‌ర్వాత పీజీ రెండేళ్ళు …అయినా మా ప్రేమ కొన‌సాగుతూనే ఉంది. చిన్న చిన్న గొడ‌వ‌లు, ఎన్నో చిలిపి ప‌నులు, తిరిగిన గుడులు, ఫ్రెండ్స్ తో క‌లిసి వెళ్లిన జాత‌ర‌లు…ఇలా ఎన్నో మ‌ధురానుభూతులు.

ఇద్ద‌రిదీ ఒక‌టే కాస్ట్ కావ‌డంతో….ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామ‌నుకున్నాం. కానీ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అత‌నా? మేమా? తేల్చుకోమ‌న్నారు. మ‌మ‌కారం ముందు ప్రేమ‌ను చంపుకున్నా…..అప్ప‌టి వ‌ర‌కు ఫోన్లో గంట‌ల‌కు గంట‌లు మాట్లాడుకునే మా మ‌ద్య నిశ్శ‌బ్దం రాజ్య‌మేలింది, క్ర‌మంగా ఫోన్ లు, మెసేజ్లు త‌గ్గిపోయాయ్.

ఫోటో…క‌ల్పితం.

ఓ రోజు స‌డెన్ నా వాట్సాప్ కు ఓ ఇమేజ్ వ‌చ్చింది, అది అత‌ని పెళ్లి కార్డ్…. నువ్వు త‌ప్ప‌క రావాలి అని దాని కిందే ఓ టెక్ట్స్ మెసేజ్. నైట్ అంతా నిద్ర లేదు. మా ఫ్రెండ్స్ లో చాలా మందికి ఫోన్ చేశా…వెళ్ళాలా? వ‌ద్దా? అని …..అంద‌రూ వ‌ద్దు అని చెప్పారు, కానీ నా మ‌న‌స్సు వెళ్లు అని చెప్పింది, మ‌న‌సు మాటే విన్నాను….మా త‌మ్ముడిని తీసుకొని అత‌డి పెళ్లికి వెళ్లాను, అత‌డి ముఖంలో ఆనందం లేదు…అత‌డి ప‌క్క‌నే అత‌ని భార్య‌..అది నేను నిల‌బ‌డాల్సిన చోటు…. 10 నిమిషాల త‌ర్వాత అక్కడి నుండి వ‌చ్చేశా….భార‌మైన మ‌న‌స్సుతో.

ఇంటికి రాగానే…మా ప్రేమ కు గుర్తుగా అత‌డు నాకిచ్చిన‌ గిప్ట్స్ ను ఒక్కొక్క‌టీ చూసుకుంటున్న‌… ప్ర‌తీ గిఫ్ట్ వెనుక ఓ మ‌ధురానుభూతి. ఓ ప్ర‌త్యేక సంద‌ర్భం.. ఇంత‌లోనే నా సెల్ కు ఓ మెసేజ్…..Thanks for coming….అని మ‌నోజ్ నుండి. ఆ రాత్రంతా ఏడుస్తూకూర్చున్నాను. ఏ ప్రేమికురాలైనా త‌న ల‌వ‌ర్ పెళ్లి ఇత‌రుల‌తో అవుతుంది అని తెలిస్తేనే త‌ట్టుకోలేరు, అలాంటిది…అత‌డి పెళ్లికి అటెండ్ అవ్వ‌డం అంటే…!! కానీ నే ఎదుర్కొన్నా…నా జీవితంలో అత్యంత బాధాక‌ర‌మైన రోజు అదే.

Comments

comments

Share this post

scroll to top